వామ్మో.. ఏంది ఇదీ పాల్.. తెలంగాణను డెవలప్ చేశారట.. ఎలా అంటే
తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా జరుగుతున్నాయి. మధ్యలో కేఏ పాల్ వచ్చారు. అదేనండి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు.. అయితే ఆయన తెలంగాణను అభివృద్ధి చేసింది తనేనని చెబుతున్నారు. సీఎం కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ పుట్టక ముందు 40 సంవత్సరాలలో తెలంగాణను అభివృద్ధి చేసింది తనే అని కేఏ పాల్ అన్నారు. అప్పుడు రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా దగ్గరికి వచ్చారని చెప్పారు.
వందలు, వేల మంది బిలియనీర్లను తీసుకొచ్చి తెలంగాణను డెవలప్ చేశానని కేఏ పాల్ వివరించారు. కేసీఆర్, కేటీఆర్.. బిల్ క్లింటన్, బిల్ గేట్స్ పేర్లు అయినా విన్నారా? అని కేఏ పాల్ అడిగారు. తెలంగాణను అభివృద్ది చేసింది తానే అన్నారు. సంగారెడ్డిలో 1200 ఎకరాల్లో ఉచిత చారిటీ సిటీ పెట్టి హైదరాబాద్ అమీర్ పేట్ లో 53వేల మంది అనాథలు, వితంతవులకు సపోర్ట్ చేశాను అన్నారు.

తెలంగాణను అభివృద్ధి చేసింది తానే అని అందరికీ తెలుసు అన్నారు. ఇప్పుడు 20, 30 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఆ విషయం తెలియకపోవచ్చన్నారు. గూగుల్ చేస్తే తెలుస్తుందన్నారు. జార్జిబుష్, బిల్ క్లింటన్ హైదరాబాద్ కు తీసుకొచ్చింది తనేనని చెప్పారు. అప్పుడు కేసీఆర్ పొలిటికల్ గా పుట్టారా? అని పాల్ అడిగారు. ఏదో టీడీపీలో పార్టీలో ఒక సేవకుడిగా ఉన్నారు అని చెప్పారు.
అభివృద్ధి చేసిన తెలంగాణను... నేడు అవినీతిమయంగా మార్చేశారని మండిపడ్డారు. అప్పుల రాష్ట్రంగా మార్చారని పాల్ వాపోయారు. తెలంగాణ అప్పులు 4 లక్షల 12 కోట్లు అని చెప్పారు. 20 లక్షల కోట్ల ఆదాయం ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల తెలంగాణగా ఎలా మారిందని కేఏ పాల్ ప్రశ్నించారు. సో అతని ప్రశ్నలకు అధికార పార్టీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications