Weather Update: హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. పెరుగుతోన్న చలి..!

తెలంగాణలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. హైదరాబాద్ నగరం అంతటా ఉదయం పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగర శివార్లలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్‌ కంటే తక్కువగా నమోదు అవుతుంది. ఈ పరిస్థితులు నవంబర్ 14 వరకు కొనసాగవచ్చని వాతావరణ శాఖ సూచించింది. కనిష్ఠంగా రాజేంద్రనగర్ లో 19.5, BHEL ఫ్యాక్టరీ 15.6,
కుత్బుల్లాపూర్ 16.4 డిగ్రీల సెల్సియస్‌ నమోదు అయింది.

వచ్చే వారంలో హైదరాబాద్ లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉదయం పొగ మంచు వస్తుందని పేర్కొంది.
దుమ్ము, పొగ మరియు కాలుష్య కారకాలు వంటి పొడి కణాలు వాతావరణంలో పేరుకుపోయినప్పుడు పొగమంచు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
పొగమంచు, మబ్బుతో కూడిన ఉదయం కారణంగా ప్రయాణీకులు తమ ప్రయాణాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి సూచిస్తున్నారు. ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

The intensity of cold is gradually increasing in the state capital Hyderabad

చలికాలం వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాత్రి పూట ఆహారం తీసుకోకపోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. మందపాటి దుస్తులు ధరించాలని పేర్కొంటున్నారు. అస్తమా ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అటు ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారనుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.

సోమవారం అన్నమయ్య, చిత్తూరు, అంబేద్కర్ కోనసీమ,తిరుపతి, కాకినాడ,నెల్లూరు జిల్లాలలోని పలు ప్రాంతాల్లో వానలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఏపీలో చలి తీవ్రత సాధారణంగానే ఉంటుందని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+