ఎంసెట్ దరఖాస్తు తేదీ పొడగింపు.. జూన్ 10 వరకు వితౌట్ ఫైన్ ఛాన్స్..

కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో పలు పరీక్షలు వాయిదా పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎంసెట్ దరఖాస్తు గడువును మరోసారి పొడిగించారు. విద్యార్థులు ఎలాంటి అపరాధ రుసం చెల్లించాల్సిన అవసరం లేకుండా జూన్ 10 వరకు ఎంసెట్ దరఖాస్తుకు అప్లయ్ చేసుకోవచ్చు.

షెడ్యూల్ ప్రకారం.. ఎంసెట్ దరఖాస్తు గడువు జూన్ 3తో ముగిసింది. కరోనా వైరస్ సోకిన పరిస్థితుల్లో ఎంసెట్ దరఖాస్తు గడువు తేదీని మరోసారి పొడిగించినట్టు ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. జూలై 5 నుంచి 9 వరకు కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో ఎంసెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎంసెట్ పరీక్ష కోసం eamcet.tsche.ac.in ద్వారా దరాఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ts eamcet 2021 application last date extended to june 10

మరోవైపు ఎంసైట్ పరీక్షను వాయిదా వేసే అవకాశం ఉంది. ఇంటర్ పరీక్షల తర్వాత ఎంసెట్ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. కానీ దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే 9 తరగతి వరకు ప్రమోట్ చేశారు. పదో తరగతి విద్యార్థులను కూడా ప్రమోట్ చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ కూడా మమ అనిపించారు. కరోనా వల్ల రెండో అకడమిక్ ఇయర్ కూడా అలానే జరుగుతుంది.

కరోనా విజృంభించడంతో సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్ష ఫలితాలను ఎగ్జామ్స్ నిర్వహించకుండానే ప్రమోట్ చేసింది. 12వ తరగతి వారికి పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. కానీ కరోనా కేసులు తగ్గకపోవడంతో వెనక్కి తగ్గింది. వారిని కూడా ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఎంసెట్ ప్రవేశ పరీక్ష మాత్రం నిర్వహిస్తామని అధికారులు చెబుతున్నారు. కానీ తేదీ వెల్లడించలేదు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించవచ్చు.. లేదంటే రద్దు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+