హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆంధ్రా మిత్రులకు విజ్ఞప్తి, మొన్న కలిశా.. జగన్‌ది అదే ఆలోచన: కేటీఆర్, ఇది బాబు కొత్త నాటకం!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసన సభ ఎన్నికల ఫలితాలు చూస్తే 17 లోకసభ స్థానాలకు గాను 15 చోట్ల సులభంగా గెలుస్తామని, అలాగే ఖమ్మంను కూడా గెలుచుకొని పదహారు స్థానాల్లో గెలవాలని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం అన్నారు. గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా మాట్లాడారు.

తాము బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఒకే ఘాటన కట్టుతున్నామని చెప్పారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌లు కూడా ఒకే ఘాటాన కట్టారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు దేశానికి నష్టం చేశాయని కేసీఆర్ కూడా చెబుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్.. వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడులను ప్రస్తావించారు.

జగన్ అదే విధంగా ఆలోచిస్తున్నారు

జగన్ అదే విధంగా ఆలోచిస్తున్నారు

తాను నిన్నగాక మొన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిశానని, ఆయన కూడా దాదాపు అదే ఆలోచనతో ఉన్నారని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలకు ఆయన దూరం పాటించే ఉద్దేశ్యంతోనే ఉన్నారని తెలిపారు. మనం ఆ పార్టీ, ఈ పార్టీ కాకుండా ఢిల్లీని శాసించేలా ఉండాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఐక్యతతో 42 లోకసభ స్థానాలు (ఏపీలో 25, తెలంగాణలో 17) గెలిస్తే ఢిల్లీని శాసించే దిశగా ముందుకు సాగుతామన్నారు. ఇదే ఆలోచనను జగన్ కూడా వ్యక్తం చేశారన్నారు. ఎన్డీయే, యూపీఏ పరిస్థితి బాగా లేదన్నారు. మనం అనుకున్న దిశగా టీఆర్ఎస్ ఢిల్లీలో నిర్ణయాత్మక శక్తిగా ఉండే సమయం ఎక్కువ దూరంలో లేదన్నారు.

పవన్ కళ్యాణ్ చేతికి జాబితా: జనసేన వైపు చూడకుండా ఆ 'ఇద్దరి' జాగ్రత్తలుపవన్ కళ్యాణ్ చేతికి జాబితా: జనసేన వైపు చూడకుండా ఆ 'ఇద్దరి' జాగ్రత్తలు

 సోనియాను తిట్టరాని తిట్టు తిట్టి, ఇప్పుడు చంద్రబాబు పొత్తు

సోనియాను తిట్టరాని తిట్టు తిట్టి, ఇప్పుడు చంద్రబాబు పొత్తు

చంద్రబాబు ఇప్పుడు పక్కనున్న ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి అని కేటీఆర్ చెప్పారు. అలాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీతో 36 ఏళ్ల వైరాన్ని పక్కన పెట్టి ఆ పార్టీతో జత కలిశారని చెప్పారు. సోనియా గాంధీని అవినీతి అనకొండ అని, ఇటలీ మాఫియా అని ఎన్నో తిట్లు తిట్టారని, అవన్నీ మర్చిపోయి.. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించాలనే లక్ష్యంతో రాహుల్ గాంధీ వద్దకు వెళ్లి కలిశారన్నారు. అందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారన్నారు. ఆ పొత్తుకు అందమైన పేరు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు.

ఏపీ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్న చంద్రబాబు

ఏపీ ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్న చంద్రబాబు


దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుల కోసం మనం ప్రయత్నాలు చేస్తున్నామని కేటీఆర్ అన్నారు. అందుకే కేసీఆర్ దేశవ్యాప్తంగా పర్యటించి అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ చంద్రబాబు నిన్న ఇవాళ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గద్దలా వచ్చి ఏపీని కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని తెరాసను ఉద్దేశించి అన్నారని మండిపడ్డారు. అసలు గద్ద ఎవరు అన్నారు. నాలుగున్నరేళ్లు మోడీతో సంసారం చేసింది చంద్రబాబే అన్నారు. ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు తన అసమర్థతను, చేతకానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకు ప్రధాని మోడీని ఓ పూచికలా, ఇతరులను మరో పూచికలా చూపిస్తా ఏపీ ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు.

ఆంధ్రా మిత్రులకు ఓ విజ్ఞప్తి

ఆంధ్రా మిత్రులకు ఓ విజ్ఞప్తి

నేను మీడియా ద్వారా ఆంధ్రా మిత్రులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నానని, మొన్నటి ఎన్నికల్లో తాము అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూపించి వెళ్లామని చెప్పారు. నచ్చితే ఓటేయండి.. మమ్మల్ని ఆశీర్వదిస్తే మరింత బలంగా పని చేస్తామని చెప్పామని అన్నారు. ప్రజలకు నచ్చి ఓటేశారన్నారు. ఆంధ్రా మిత్రులకు, ఆంధ్రా ప్రాంత అన్నదమ్ములకు ఒకటి చెబుతున్నానని, ప్రాంతాలుగా విడిపోయినా కలిసే ఉందామని, అన్నదమ్ముల్లా విడిపోయి అభివృద్ధిలో పోటీ పడదామని చెప్పామని అన్నారు. ఆంధ్రా అభివృద్ధికి, ఆంధ్రకు తెరాస వ్యతిరేకం కాదన్నారు.

చంద్రబాబు కొత్త నాటకం

చంద్రబాబు కొత్త నాటకం

ఉద్యమం సమయంలో ఆవేశకావేశాల కారణంగా ఓ మాట అని, పది మాటలు పడ్డామని కేటీఆర్ చెప్పారు. ఇటు వైపు నుంచి తూటాలు వచ్చాయి, అటువైపు నుంచి తూటాలు పేలాయన్నారు. కానీ విభజన తర్వాత తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా మిత్రులు తమకు ఓటు వేసి గెలిపించారని చెప్పారు. కానీ చంద్రబాబు ఏపీకి చేసిందేమీ లేదన్నారు. చెప్పుకోవడానికి ఏదీ లేదన్నారు. చంద్రబాబు ఎన్ని మాయోపాయలు చేసినా, మీడియాలో ఎంత ప్రచారం చేసినా లాభం లేకుండా పోయిందని చెప్పారు. ఆంధ్రా ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో ఆయన కొత్త నాటకానికి తెరలేపారన్నారు. తన సమర్థత ఆధారంగా అడగాల్సిన ఓటును చంద్రబాబు.. తన అసమర్థతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ పైన, తెరాస పైన నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు

కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు

ప్రధాని నరేంద్ర మోడీతో మాకేం సంబంధమని కేటీఆర్ చెప్పారు. నాలుగున్నర ఏళ్లు బీజేపీతో కలిసి ఉంది మీరన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మేం చిత్తుచిత్తుగా ఓడించామని చెప్పారు. ఇప్పుడు తెరాసను ఓడించేందుకు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యారని చెప్పారు. బీజేపీ అంటే బిల్డప్ జాతీయ పార్టీగా మారిందన్నారు. ఎన్నికల సమయంలో ఎన్నైనా అనుకుంటామని, తెలంగాణ వారి గురించి అందరికీ తెలుసునని, కోపం వచ్చినా ఆగదని, ప్రేమ వచ్చినా ఆగదన్నారు.

English summary
Telangana Rastra Samithi (TRS) working president KT Rama Rao on Friday said that YSR Congress party cheif YS Jagan Mohan Reddy is thinking like Telangana CM KCR about federal front for national politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X