ఘోర ప్రమాదం: లోయలో పడ్డ వ్యాన్, 13మంది మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తర్‌కాశీ జిల్లాలో ఓ వ్యాను లోయలో పడి 13 మంది మృతిచెందారు. బట్వాడీలో సోమవారం సాయంత్రం కొండచరియలు విరిగిపడటంతో ఓ వ్యాను అదుపుతప్పి లోయలో పడిపోయింది.

పోలీసులు, రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన ప్రమాదస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 13మంది అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. బట్వాడీలోని బకోలీ గ్రామానికి చెందిన 13 ఏళ్ల మీనాక్షి, రాధలు ప్రాణాలతో బయటపడ్డారు.

 13 dead after van falls into gorge in Uttarakhand

దోపిడీ దొంగల బీభత్సం

చెన్నై- పాట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో బోగీల్లోకి చొరబడిన దుండగులు ప్రయాణికులపై దాడి చేసి వారి నుంచి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెన్నై నుంచి ఆదివారం గంగా-కావేరీ ఎక్స్‌ప్రెస్‌ బీహార్‌ రాజధాని పాట్నాకు బయల్దేరింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఉత్తర్‌ప్రదేశ్‌లోని చిత్రాకూట్‌ మీదుగా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లోకి కొందరు దోపిడీ దొంగలు చొరబడ్డారు. తమ వద్ద ఉన్న ఆయుధాలతో ప్రయాణికులను బెదిరించారు. వారి నుంచి నగలు, డబ్బు తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+