యువతిపై గ్యాంగ్‌రేప్: ఆ వీడియోను తండ్రితోపాటు గ్రామస్తులకు వాట్సప్ చేశారు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదహారేళ్ల యువతిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

మీరట్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. పదహారేళ్ల యువతిపై ముగ్గురు కామాంధులైన యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని ఆ దుర్మార్గులు.. ఆ ఘాతుకాన్ని వీడియో తీసి, దాన్ని తండ్రితోపాటు బాధిత యువతి గ్రామంలోని వారికి వాట్సప్ ద్వారా పంపించారు.

వివరాల్లోకి వెళితే.. మీరట్ నగరానికి సమీపంలోని భావన్ పూర్ గ్రామానికి చెందిన పదహారేళ్ల ఓ యువతి ఏదో పనికోసం ఫిబ్రవరి 28వ తేదీన ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ యువతిని ముగ్గురు యువకులు బలవంతంగా చెరకు తోటలోకి తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం జరిపారు.

16-year-old gangraped in Meerut, video shared on WhatsApp

అత్యాచారాన్ని వీడియో తీసి.. యువతి తండ్రితోపాటు పలువురు గ్రామస్థులకు వాట్పాప్ ద్వారా పంపించారు. దీంతో యువతి తండ్రి కూతురి అత్యాచార దృశ్యాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, యువతిని వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే హతమారుస్తామని నిందితులు బెదిరించారని బాధిత యువతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read in English: Minor gangraped in Meerut
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+