ఢిల్లీ వరుస బాంబు పేలుళ్ల కేసు: పాటియాలా కోర్టు కీలక తీర్పు
కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొహమ్మద్ రఫిఖ్ షా, మొహమ్మద్ హుస్సేన్ ఫజిలిలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
న్యూఢిల్లీ: 2005లో ఢిల్లీలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల ఘటనపై పాటియాలా కోర్టు నేడు తీర్పు వెలువరించింది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మొహమ్మద్ రఫిఖ్ షా, మొహమ్మద్ హుస్సేన్ ఫజిలిలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
మరో నిందితుడు తారిఖ్ అహ్మద్ దార్‌కు కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే కోర్టు తీర్పుపై బాధితురాలి తల్లి అసంతృప్తితో ఉన్నారు. కశ్మీర్ కు చెందిన తారిఖ్ పేలుళ్ల వెనుక సూత్రధారిగా ఉన్నాడు. అప్పట్లో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు బంగ్లాదేశ్ లోని ఢాకాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సరైన ఆధారాలేవి లేనందువల్ల అదుపులోకి తీసుకున్న మూడు నెలలకే తారిఖ్ ను విడుదల చేశారు.

ఇదిలా ఉంటే, పాటియాలా తీర్పును సవాల్ చేసేందుకు హైకోర్టును ఆశ్రయించనున్నట్టు తీర్పు అనంతరం ఆమె మీడియాతో చెప్పారు. తమకు న్యాయం జరిగేవరకు పోరాడతామని స్పష్టం చేశారు.కాగా, అప్పటి వరుస బాంబు పేలుళ్ల ఘటనలో 60మంది తమ ప్రాణాలు కోల్పోగా, 100మంది దాకా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications