షాక్: పళని, పన్నీర్ పై కోపం: టీటీవీ దినకరన్ కు 21 మంది ఎమ్మెల్యేల మద్దతు, ఏం చేస్తారు ?
తమిళనాడు రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే పార్టీలోని ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏ గ్రూప్ లో ఉంటారో అర్థంకాకుండాపోయింది.
చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో కీలకపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అన్నాడీఎంకే పార్టీలోని ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏ గ్రూప్ లో ఉంటారో అర్థంకాకుండాపోయింది. పళనిసామి వర్గంలోని ఎమ్మెల్యేలు రోజుకొకరు జారీపోవడంతో తమిళ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.
శనివారం మరో ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ కు మద్దతు ఇవ్వడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం హడలిపోయారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా ఏం చెయ్యాలి ? అంటూ తలలు పట్టుకుంటున్నారు.

తమిళనాడులోని విరుతచలం నియోజక వర్గం శాసన సభ్యుడు కలైసెల్వం శనివారం చెన్నైలోని టీటీవీ దినకరన్ ఇంటికి చేరకుని చర్చలు జరిపారు. అనంతరం కలైసెల్వం మీడియాతో మాట్లాడుతూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిసామి ఇటీవల మళ్లీ పార్టీలోకి వచ్చిన పన్నీర్ సెల్వంకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
పన్నీర్ సెల్వంకు ప్రభుత్వంలో ఎక్కువ ప్రధాన్యత ఇవ్వడం వలనే తాను సహించలేక టీటీవీ దినకరన్ కు మద్దతు ఇస్తున్నానని ఎమ్మెల్యే కలైసెల్వం చెప్పారు. ఇంకా కొంత మంది ఎమ్మెల్యేలు టీటీవీ దినకరన్ కు మద్దతు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారని చెప్పిన ఎమ్మెల్యే కలైసెల్వం పళనిసామి మీద బాంబు వేశారు.












Click it and Unblock the Notifications