ఆ రాష్ట్రంలో 255 ఏళ్లవరకు మనుషులు బ్రతుకుతున్నారా ..!? అంతా ఎన్నికల సంఘం ఘనత
న్యూఢిల్లీ : ఎన్నికల సందర్భంగా చిత్ర విచిత్ర సిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో వయోజనులకు ప్రముఖుల పేర్లు, కూరగాయాలు, పండ్ల పేర్లతో ఓటర్ల జాబితా విడుదలై సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యింది. ఈ సారి ఎన్నికల సంఘం మరో రికార్డు సృష్టించింది. పంజాబ్ రాష్ట్రంలో ఏకంగా 273 మంది వయోజనుల వయస్సు 118 ఏళ్లు నిర్ధారించి తప్పులో కాలేశారు.

వందేళ్లు దాటిన వారు వందల సంఖ్యలో ..
ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల కోసం ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. కానీ ఎక్కడో జరిగే చిన్న పొరపాటు వల్ల ఈసీకి చెడ్డపేరు తీసుకొస్తుంది. పంజాబ్ తో పాటు ఇతర నగరాల్లో కూడా శతాధిక వయస్సు కలిగిన ఓటర్లు ఉన్నారని సెలవిచ్చింది ఈసీ. అమృత్ సర్ లో 558, హోషియార్ లో 449 మంది ఉండగా ... పంజాబ్ లోని లుథియానాలో 273 మంది శతాధిక వృద్ధులు ఉన్నట్టు తెలిపింది.

సాక్షాత్తు సీఈసీ సెలవిచ్చారు .. మరీ
సాధారణంగా తప్పులు జరుగుతుంటాయి. వాటిని సరిచూసుకోవాలి. కానీ పంజాబ్ రాష్ట్రంలో 5 వేల 916 మంది ఓటర్ల వయస్సు గల వారు ఉన్నారని ఏకంగా ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఎస్కే రాజు తెలిపారు. లుథియానా జిల్లాలో ఉన్న 57 మంది శతాధిక ఓటర్లను బూత్ అధికారులతో పరిశీలన చేయించగా వారిలో 35 మంది చనిపోయారని తెలిసింది.

వామ్మో 255 ఏళ్లా ?
లుథియానాకు చెందిన అక్షిత్ థావన్, గిల్ అసెంబ్లీ సెగ్మెంట్ కు చెందిన అశ్వనీకుమార్ వయస్సు ఓటర్ల జాబితాలో 255 ఏళ్లని అధికారులు పేర్కొన్నారు. లుథియానాకు చెందిన శారదాదేవి 1874లో జన్మించిందని ఓటర్ల జాబితాలో అధికారులు పేర్కొన్నారు. అంటే ఆమె వయస్సు 145 ఏళ్లు .. దీనిపై ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే .. ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ అగర్వాల్ చెప్పారు. వాటిని పరిశీలించి సరిదిద్దుతామని వెల్లడించారు.

2000 బదులు 1900
273 మంది ఓటర్ల వయస్సు 118 ఏళ్లని ఓటర్ల జాబితాలో చేరిందని, కానీ వాస్తవానికి అది కొత్తగా నమోదైన ఓటర్ల లిస్ట్ అని తెలిపారు. కొత్త ఓటర్లు 2000 సంవత్సరంలో జన్మించగా, వారు 1900 ఏడాదిలో జన్మించినట్టు తప్పుగా నమోదు చేయడంతో జాబితా తప్పుల తడకగా మారింది.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications