29 వేల లీటర్ల లిక్కర్ మాయం.. నిజమేనండి బాబూ.. ఎవరి పని అంటే..
వినడానికే విచిత్రంగా ఉన్న ఇదీ మాత్రం నిజం. ఒకటి కాదు రెండు కాదు 29 వేల లీటర్ల లిక్కర్ కనిపించడం లేదు. కానీ ఎలా మాయమయ్యిందని అడిగితే విచిత్రమైన సమాధానం వస్తోంది. ఎలుకలు తాగేశాయని పోలీసులు చెబుతుండటం కాస్త ఆశ్చర్యంగా ఉంది. పోలీస్ట్ స్టేషన్లలో భద్రపరిచిన మద్యాన్ని ఎలకలు తాగేశాయయని వారు అంటున్నారు.

మద్యం పట్టివేత
ఇటీవల వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు రైడ్ జరిపారు. అక్రమంగా నిలువ చేసిన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 50 వేల లీటర్ల నాటు సారా, 30 వేల లీటర్ల మద్యం, 3 వేల క్యాన్ల బీర్‌ను జప్తు చేశారు. ఆ క్రమంలో వారు 825 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో కోర్టు విచారణ జరుగుతుండటంతో ఈ మద్యాన్ని వారు పోలీస్ స్టేషన్లలోని స్టోర్ రూమ్స్‌లో భద్రపరిచారు.

కోర్టు తీర్పుతో
దీనికి సంబంధించి కోర్టు తీర్పు వెలువడటంతో ఆ మద్యాన్ని పారేశేందుకు వారు నిర్ణయం తీసుకున్నారు. నిల్వ ఉంచిన మద్యంలో దాదాపు 29 వేల లీటర్లు కనిపించకుండా పోయినట్టు తెలుస్తోంది. ఆ మద్యం అంతా ఏమైపోయిందని పోలీసులను ప్రశ్నించగా.. ఎలుకలు తాగేశాయని వారు చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు ప్రస్తుతం అక్కడ దర్యాప్తు ప్రారంభమైంది.

ఎవరి ప్రమేయం ఉందా..?
ఎలుకలు ఏంటీ మద్యం తాగడం ఏంటీ అనే సందేహం ప్రతీ ఒక్కరికీ వస్తోంది. కానీ ఇంత మొత్తంలో కనిపించకపోవడంతో అనుమానాలు ఎక్కువయ్యాయి. నిజంగానే ఎలుకలు మాయ చేశాయా..? లేదంటే కొందరి ప్రమేయం ఉందా అనే సందేహాలు వస్తున్నాయి. కావాలనే తీసి.. చివరకు ఎలుకల పేరు చెప్పి తప్పించుకుంటున్నారా అనే డౌట్స్ వస్తున్నాయి. కానీ ఘటనపై విచారణ జరగడంతో.. నిజ నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications