వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: షీలా దీక్షిత్ ఢిల్లీ బంగ్లాలో 31 ఏసీలు, 15 కూలర్లు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆమె అధికారిక బంగ్లాలో ఏర్పాటు చేసిన రకరకాల ఎలక్ట్రిక్ పరికరాల్లో 31 ఏసీలు, 25 హీటర్లు ఉన్నాయి. మోలీలాల్ నెహ్రూ మార్గ్‌లోని షీలా నివాసంలో కనీసం 31 ఏసీలు, 15 కూలర్లు, 25 హీటర్లు, 16 ఎయిర్ ప్యూరిఫైయర్లు, 12 గీజర్లు ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక విరణకు ఇచ్చిన అధికారిక సమాధానంలో తెలియజేశారు.

ముఖ్యమంత్రి అవసరాలకు తగినట్లుగా ఆ సమయంలో బంగళాలో చేసిన ఎలక్ట్రికల్ మరమ్మతులకోసం 16.81 లక్షల రూపాయలు ఖర్చయిందని సిపిడబ్ల్యుడి తెలియజేసింది.

కేరళ గవర్నర్‌గా షీలా అక్కడి రాజ్‌భవన్‌కు మారిన తర్వాత ఆమె బంగళా నుంచి తొలగించిన ఎలక్ట్రికల్ పరికరాల జాబితాను సిపిడబ్ల్యుడి తెలియజేస్తూ, ఈ పరికరాల్లో కొన్నింటిని అవసరాల కోసం వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగిస్తున్నట్లు తెలియజేసింది. మిగిలిన ఎయిర్‌కండిషనర్లను అవసరం పడినప్పుడు ఉపయోగించడం జరుగుతుందని ఆర్‌టిఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్‌కు ఇచ్చిన సమాధానంలో సిపిడబ్ల్యుడి తెలియజేసింది.

31 air conditioners were installed at Sheila Dikshit's official residence as Chief Minister

మూడుసార్లు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేసిన షీలా దీక్షిత్ గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత సుమారు మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో 1920లో నిర్మించిన ఈ నాలుగు బెడ్‌రూమ్‌ల విశాల భవనాన్ని ఖాళీ చేసిన విషయం తెలిసిందే. ఈ భవనాన్ని ఖాళీ చేసిన తర్వాత ఆమె పిరోజ్‌షా రోడ్‌లోని మూడు బెడ్‌రూమ్‌ల చిన్న ఇంటికి మారారు. షీలా ఖాళీ చేసిన బంగళాను మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోసం ఇటీవల సుమారు 35 లక్షల రూపాయల ఖర్చుతో రిపేర్లు చేశారు.

English summary
As many as 31 air conditioners and 25 heaters were among a number of electrical appliances installed in the official bungalow of Sheila Dikshit in Delhi when she was CM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X