వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

3 ఏళ్ళుగా ఇరాక్‌లో 39 మంది భారతీయుల అదృశ్యం

ఇరాక్‌లో ఆచూకీ దొరకని భారతీయులను వెతికి స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారితశాఖల మంత్రి విజయ్ సంప్లా చెప్పారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇరాక్‌లో ఆచూకీ దొరకని భారతీయులను వెతికి స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారితశాఖల మంత్రి విజయ్ సంప్లా చెప్పారు.

మూడేళ్ల క్రితం ఐసిస్ ఉగ్రవాదులు అపరహరించిన 39 మంది భారతీయులు ప్రస్తుతం బుదుష్‌లోని జైల్లో ఉండే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి సుస్మాస్వరాజ్ ఇదివరకే ప్రకటించారు.

అయితే బుదుష్‌లో జైలు ఎప్పుడో నేలమట్టం అయిందన్న వార్తలు ప్రచారం కావడంతో బాధితుల కుటుంబాల్లో ఆందోళన ఎక్కువైంది.

39 missing Indians: Govt doing all it can, says MoS Sampla

ఇరాక్ రాయబార కార్యాలయం ఆదేశం మేరకు భారతీయుల ఆచూకీ కోసం అన్వేషణ సాగిస్తున్నట్టు చెప్పారాయన. ఇద్దరు ఉన్నతస్థాయి అధికారులను ఈ పని నిమిత్తం ఇరాక్‌కు పంపినట్టు చెప్పారు.

త్వరలోనే బాధితులను ఇండియాకు తీసుకువస్తామన్నారాయన.బుదుష్ జైలు గురించి పూర్తి వివరాలు తనకు తెలియదన్నారు. విదేశాల్లో తప్పిపోవడం, ఆచూకీ లేకుండా పోయిన భారతీయులు ఎక్కువగా పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందినవారేనని మంత్రి విజయ్ సంప్లా చెప్పారు.

English summary
Vijay Sampla, the Union Minister of State for Social Justice and Empowerment, said the Narendra Modi government is doing everything it can to bring back the 39 Indian nationals missing in Iraq.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X