సీబీఐ అధికారులపై 56 కేసులు: పెండింగ్
న్యూఢిల్లీ: సీబీఐ అధికారులపై 56 కేసులు పెండింగ్ లో ఉన్నాయని కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) తెలిపింది. ఇటీవల పార్లమెంట్ ప్రవేశ పెట్టిన వార్షిక నివేదికలో సీవీసీ ఈ వివరాలు వెల్లడించింది.
2015 డిసెంబర్ 31 నాటికి మొత్తం 56 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అందులో గ్రూప్ ఏ అధికారులపై 31 కేసులు, గ్రూప్ బీ, సీ అధికారులపై 25 కేసులు పెండింగ్ లో ఉన్నాయని నివేదికలో పేర్కొంది.

56 కేసుల్లో 18 కేసులు నాలుగేళ్లుగా, మూడు కేసులు మూడేళ్లుగా, ఐదు కేసులు రెండేళ్లుగా, ఏడు కేసులు ఏడాదికి పైగా పెండింగ్ లో ఉన్నాయని సీవీసీ తెలిపింది. 2015లో సీబీఐ 1,135 కేసులు నమోదు చేసింది.
అందులో 185 లంచం కేసులు, 67 అక్రమాస్తుల కేసులు ఉన్నాయని నివేదికలో తెలిసింది. సీబీఐ అధికారుల మీద నమోదు అయిన కేసుల వివరాలను సీవీసీ నివేదిక తయారు చేసి సమర్పించింది.












Click it and Unblock the Notifications