ఘోర పడవ ప్రమాదం, 8 మంది మృతి: 17 మందిని కాపాడిన రెస్క్యూ టీం
బెంగళూరు: కర్ణాటకలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కార్వార్ ప్రాంతంలో 25 ప్రయాణీకులతో వెళ్తున్న పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు. ఒకరు గల్లంతయ్యారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎనిమిది మృతదేహాలను బయటకు తీశారు.
రెస్క్యూ సిబ్బంది పదిహేడు మందిని కాపాడింది. వీరంతా ఓ జాతరకు హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. విషయం తెలియగానే ఉన్నతాధికారులు, నేవీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. అతనిని ఆచూకీ గుర్తించేందుకు గోవా నుంచి డైవర్లు, హెలికాప్టర్లను దించారు.

ఈ పడవ ప్రమాదానికి గురైన సమయంలో కార్వార్ బీజేపీ నాయకురాలు, ఎమ్మెల్యే రూపాలీ నాయక్ మరో పడవలో ఉన్నారు. పడవ ప్రమాదంలో మునిగిన వారిని రక్షించాలని ఈమె వెంటనే తన సిబ్బందిని ఆదేశించారు. ఆమె సిబ్బంది ఇద్దరిని కాపాడారు. ఆ తర్వాత నేవీ రంగంలోకి దిగింది.
-
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్












Click it and Unblock the Notifications