బీటెక్ చదివి బివర్సా పనులు, షాపింగ్ మాల్స్ లో అమ్మాయి, ఆంటీలను టార్గెట్ చేసి !

బెంగళూరు: అందంగా ఉన్న వివాహిత మహిళ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ మాల్ లో షాపింగ్ కు వెళ్లింది. తరువాత ఆమె వాష్ రూమ్ కు వెళ్లి వచ్చింది. కొన్ని నెలల తరువాత మహిళ బందువు ఫోన్ చేసి నీ అశ్లీల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఉన్నాయని, ఎందుకు ఇలా చేశావని మండిపడ్డారు. షాక్ తిన్న మహిళ సోషల్ మీడియాలో చూస్తే ఆమె అశ్లీల ఫోటోలు, వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి.

చెన్నైలోని ఆదంబాక్కం ప్రాంతానికి చెందిన ఓ మహిళ సౌత్ జోన్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. గతేడాది దీపావళి పండుగ సందర్భంగా ఓ ప్రముఖ టెక్స్‌టైల్ కంపెనీలో బట్టలు కొనేందుకు తాను షాపింగ్ కు వెళ్లానని, ఆ తర్వాత నాకు తెలియకుండా ఎవరో నన్ను చిత్రీకరించి తరువాత అసభ్యకరంగా ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి టెలిగ్రామ్ యాప్‌లో విక్రయిస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.

A B.Tech graduate who takes photos and videos of women and morphs them and sells them on social media

ఈ ఫిర్యాదు మేరకు చెన్నై సౌత్ జోన్ జాయింట్ కమిషనర్ సీపీ చక్రవర్తి ఆదేశాల మేరకు ఇన్‌స్పెక్టర్ కవిత కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో తమిళనాడులోని ఈరోడ్ నుంచి ఆ మహిళ అశ్లీల ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ అయ్యాయని తెలిసింది. విచారణ ఆధారంగా ఈరోడ్ జిల్లా సత్యమంగళం అగ్రకరం ప్రాంతానికి చెందిన చోండా ఎన్‌ఎం ఆర్య అలియాస్ ఆర్యా (22) అనే యువకుడిని స్పెషల్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

విచారణలో ఆర్యా బీటెక్ గ్రాడ్యుయేట్ అని తేలింది. సూపర్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్‌కు వస్తున్న మహిళలను సెల్‌ఫోన్‌లతో వారికి తెలియకుండా రహస్యంగా వీడియోలు, ఫొటోలు తీస్తున్నాడని, అతను సాంకేతికతను ఉపయోగించి వీడియోలు, ఫోటోలు అసభ్యకరంగా చిత్రీకరించాడని, ఈ వీడియోలను టెలిగ్రామ్ యాప్ గ్రూప్‌లో షేర్ చేసి విక్రమిస్తున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఈ వీడియోలను చూసేందుకు పాస్‌వర్డ్‌లు క్రియేట్ చేసి ఆన్‌లైన్ ద్వారా వాటిని డబ్బులు చెల్లించి పాస్ వర్డ్ తీసుకున్న వారికి పంపాడని పోలీసులు అన్నారు. ఇలా మహిళల అశ్లీల ఫోటోలు, వీడియోలు విక్రయిస్తున్న ఆర్యా లక్షల్లో డబ్బు సంపాదించినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆర్యా నుంచి 1 సెల్ ఫోన్, 1 ల్యాప్‌టాప్, బ్యాంకు ఖాతా కార్డులు, మహిళల అసభ్య చిత్రాలు ఉన్న 2 హార్డ్ డిస్క్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

విచారణ అనంతరం ఆర్యాను జ్యుడీషియల్ కస్టడీకి తరలించామని పోలీసులు తెలిపారు. అదేవిధంగా చెన్నై, సిటి శివారు ప్రాంతాల్లో షాపులకు వెళ్తున్న మహిళల అసభ్యకర ఫొటోలను పోస్ట్ చేసి టెలిగ్రామ్ గ్రూపుల్లో విక్రయిస్తున్న వ్యక్తులను పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి ముమ్మరంగా విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+