కూర్గ్ అందాలు చూడాలని ఒంటరిగా వెళ్లాడు, అందనంత దూరాలకు వెళ్లిపోయిన టెక్కి !
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు, కార్పోరేట్ కంపెనీ ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు విశ్రాంతి తీసుకోవడానికి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, సాటి ఉద్యోగులతో కలిసి కర్ణాటకలోని పర్యాటక కేంద్రాలు, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలోని పర్యాటక కేంద్రాలకు వెళ్లి వస్తుంటారు.
కర్ణాటకలోని పర్యాటక కేంద్రాల్లో కూర్గేకు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అనే విషయం కొత్తగా చెప్పనవసరం లేదు. కూర్గ్ అందాలను చూసేందుకు బెంగళూరు నుంచి వెళ్లిన ఐటీ కంపెనీ ఉద్యోగి లాడ్జిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతి చెందిన ఐటీ ఉద్యోగిని బెంగళూరులో నివాసం ఉ:డే సందేశ్ (35)గా గుర్తించామని కొడుగు జిల్లా పోలీసు అధికారులు తెలిపారు.

బెంగళూరులోని ఓ ఐటీ కంపెనీలో సందేష్ ఉద్యోగం చేస్తున్నాడు. మూడు రోజుల క్రితం కొడగుకు వెళ్లిన సందేష్ మడికేరి పట్టణంలోని కోహినూర్ రోడ్డులోని ఓ లాడ్జిలో గదిని బుక్ చేసుకున్నాడు. మూడు రోజుల నుంచి కొడగులోని వివిధ ప్రాంతాలలో సందేష్ ఒంటరిగా తిరిగుతున్నాడు. పలు ప్రాంతాల్లో ఒంటరిగా తిరిగిన సందేష్ సోమవారం రాత్రి లాడ్జ్ లో ఉంటున్న అతని గదిలోకి వెళ్లాడు. రాత్రి ఏమైనా కావాలా అని అడగడానికి లాడ్జ్ సిబ్బంది వెళ్లిన సమయంలో వారితో సందేష్ బాగానే మాట్లాడాడని తెలిసింది.
మంగళవారం లాడ్జ్ లోని గదిలో నుండి సందేష్ బయటకు రాలేదు. మంగళవారం మధ్యాహ్నం అయినా లాడ్జిలో ఉన్న సందేష్ ఎందుకు బయటకు రాేదని లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చింది. తరువాత లాడ్జ్ సిబ్బంది గది తలుపు తట్టారు. ఆ తర్వాత కూడా సందేష్ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి పక్కనే ఉన్న మరో గదిలో నుంచి కిటికీలో చూడగా సందేష్ ఉరి వేసుకున్న విషయం గమనించిన లాడ్జ్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి తలుపులు పగులగొట్టి గదిలోకి ప్రవేశించి పరిశీలించారు. లాడ్జ్ లోని ఆ గదిని పరిశీలించి ఆ గదిలోకి ఎవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించారు. సందేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ కేసుకు సంబంధించి లాడ్జి సిబ్బందిని విచారించిన పోలీసులు ఆ లాడ్జ్ లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై మడికేరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.












Click it and Unblock the Notifications