ఆన్ లైన్ లో మీకు ఉద్యోగం, సైబర్ పోలీసుల పేరుతో భార్గవికి ఎన్ని లక్షలు మోసం చేశారంటే ?

పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి మోసాలు చెయ్యడం ఎక్కువ అయ్యాయి. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు ఎక్కువ అయ్యాయి. దేశ ఐటీ రాజధాని బెంగళూరు నగరంలో కూడా సైబర్ నేరాల సంఖ్య తక్కువ లేవని పోలీసు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. అమాయకులను టార్గెట్ చేసుకుని లక్షలాది రూపాయలతో పాటు కోట్ల రూపాయలు లూటీ చేస్తున్నారు.

సైబర్ క్రైమ్ పోలీసుల ముసుగులో మోసగాళ్లు రెచ్చిపోయారు. మీరు విపరీతమైన లాభాలు చూస్తారని నమ్మించి ఏకంగా మహిళ నుంచి రూ 38 లక్షలు దోచుకున్న నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సైబర్ పోలీసులు అని చెన్ని బెంగళూరులో నివాసం ఉండే మహిళను మాయ చేశారని పోలీసు అధికారులు అంటున్నారు. బెంగళూరు నగరంలోని సాంకిరోడ్డుకు చెందిన భార్గవి రావు అనే మహిళ మోసపోయారని పోలీసులు తెలిపారు.

A Bengaluru woman was cheated of Rs 38 lakh in the name of online jobs by the cyber police

బాధితురాలు భార్గవి రావు బెంగళూరు సెంట్రల్ డివిజన్ సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్గవి రావు బ్యాంకు ఖాతాల ద్వారా నగదు బదిలీ అయిన సాంకేతిక సమాచారం ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారుజ. కొద్దిరోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి భార్గవికి ఫోన్ చేసి పార్ట్‌టైమ్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు. ఇందులో సులువుగా లక్షల్లో డబ్బు సంపాదించవచ్చని భార్గవి రావుకు చెప్పారు.

అందుకు భార్గవి రావు అంగీకరించడంతో టెలిగ్రామ్ ద్వారా ఆమెకు ఒక లింక్ పంపించారు. తాను పంపిన కంపెనీ లింక్‌ను ఉపయోగించి డబ్బు పెట్టుబడి పెడితే రెట్టింపు లాభం పొందవచ్చని ఆసి చూపించారు. తరువాత మేము సైబర్ క్రైమ్ పోలీసులు అని, మీకు వచ్చిన లింక్ జినైన్ కంపెనీది అని మరో వ్యక్తి భార్గవి రావు కు సమాచారం ఇచ్చాడని తెలిసింది. ఇలా రెండు మూడు రోజులు భార్గవి రావుతో నిందితులు టచ్ లో ఉన్నారు.

అదేవిధంగా నిందితులు సూచించిన బ్యాంక్ ఖాతాకు దశలవారీగా భార్గవి రావు రూ 38. 9 లక్షలు చెల్లించింది. దీని తర్వాత భార్గవి రావుకు నిందితులు ఎలాంటి నగదు బదిలి చెయయలేదు. దీంతో మళ్లీ భార్గవి రావుకు ఫోన్ చేసిన అగంతకుడు సైబర్ క్రైమ్ పోలీసులనని పరిచయం చేసుకున్నాడు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి ఇప్పిస్తానని నమ్మించి భార్గవి వారి నుంచి ₹40 వేలు దోపిడీ చేసిందని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+