ప్రిన్సిపాల్ ఛాంబర్ లో ఇంటర్ అమ్మాయితో ?, సీసీటీవీ కెమెరాల్లో, మార్కులు తక్కువ వచ్చాయని ?
బెంగళూరు: ఐటీ హబ్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ప్రిన్సిపాల్ తన ఆఫీసు గదిలో పీయూసీ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. కాలేజ్ ప్రిన్సిపాల్ తన ఛాంబర్‌లో మాట్లాడాలని విద్యార్థినిని పిలిపించి ఈ చర్యకు పాల్పడ్డారని అమ్మాయి కుటుంబ సభ్యులు చెబుతున్నారని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.
16 ఏళ్ల విద్యార్థినిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలపై పీయూసీ (ఇంటర్) కాలేజీ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్న 40 ఏళ్ల వ్యక్తిపై కేసు నమోదైందని బెంగళూరు పోలీసు అధికారులు అంటున్నారు. అమ్మాయి తల్లి బెంగళూరులోని వయ్యాలికావల్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.

ఇంటర్నల్ మార్కుల విషయంపై చర్చించాలనే నెపంతో కాలేజ్ ప్రిన్సిపాల్ ఆబాలికను తన ఛాంబర్‌కు తీసుకెళ్లాడని, తరువాత మాట్లాడుతున్న సమయంలో బాలిక మీద లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాలేజ్ అమ్ామయి మీద అదే కాలేజ్ ప్రిన్సిపాల్‌పై లైంగిక వేధింపుల చేశారని ఆరోపిస్తూ ఫోక్సో చట్టం కింద వయ్యాలికావెల్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఈ ఘటనపై ఇరువర్గాలకు పోలీసు అధికారులు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారని కన్నడ మీడియా తెలిపింది. ఈ ఘటనపై కాలేజ్ లోని ప్రిన్సిపాల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను సేకరించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు. సీసీటీవీ కెమెరాలు కాలేజ్ లో మాత్రమే ఉన్నాయని, కాలేజ్ ప్రిన్సిపాల్ కార్యాలయంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయలేదని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. బెంగళూరులోని కేసీ జనరల్ ఆసుపత్రిలో ఇంటర్ విద్యార్థికి వైద్య పరీక్షలు నిర్వహించారు.












Click it and Unblock the Notifications