తండ్రి మీద కోపంతో కాలేజ్ అమ్మాయి ఏం చేసిందంటే ?, కూతురిగా ఎప్పుడైనా చూశావా?
తన తండ్రి లేకపోతే మన ఫ్యామిలీ లేదని ఆడపిల్ల ఆలోచిస్తుంది. అలాంటి కూతుర్లను కన్నతండ్రి ఎలా చూసుకోవాలి ?. కన్న కూతురిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలా ? లేదంటే ?.
అహమ్మదాబాద్/గుజరాత్: అమ్మాయిలకు మొదటి హీరో ఆమె నాన్న. తండ్రి కోసం కిడ్నీలు దానం చేసిన అమ్మాయిలు వందల సంఖ్యలో ఉన్నారు. కోట్ల మంది అమ్మాయిలు ఆమె తండ్రిని ఎక్కువ ఇష్టపడుతారు. తన తండ్రి లేకపోతే మన ఫ్యామిలీ లేదని ఆడపిల్ల ఆలోచిస్తుంది. అలాంటి కూతుర్లను కన్నతండ్రి ఎలా చూసుకోవాలి ?. కన్న కూతురిని పువ్వుల్లో పెట్టి చూసుకోవాలా ? లేదంటే ?.
గుజరాత్ లోని రాజ్ కోట్ జిల్లాలోని కుటియానాలో నివాసముంటున్న దివ్యా రమేష్‌కు చదువుపై మక్కువ ఎక్కువ. దివ్యా రమేష్ ఇంటర్ మొదటి సంవత్సరం ( 11వ తరగతి) చదువుతున్నది. దివ్యా ఆమె పైచదువుల కోసం అమ్మమ్మ ఇంటి ధోరాజీ సిటీకి వచ్చింది. అక్కడ రాయల్ స్కూల్ హాస్టల్ లో ఉంటోంది. చదువు, ఇతరత్రా పనుల్లో ముందుండే దివ్యా హాస్టల్‌లోని ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

దివ్యా స్వల్ప అస్వస్థతకు గురైంది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించి తిరిగి హాస్టల్ లోని ఆమె రూమ్ కు తీసుకొచ్చారు. దివ్యాకు ఆరోగ్యం బాగోకపోవడంతో ఆమె రూమ్‌మేట్స్ ఆమెను చదువుకునేందుకు గదిలో వదిలి హాల్లోకి వచ్చారు. బాలికలు చదువు ముగించుకుని గదికి వచ్చేసరికి దివ్యా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉందని పోలీసులు అన్నారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హాస్టల్‌కు చేరుకుని దివ్యా గదిని తనిఖీ చేయగా డెత్ నోట్ దొరికింది. ఆమె డెత్ నోట్ చదివిన పోలీసులు కాసేపు ఉలిక్కిపడ్డారు. దివ్యా ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో వివరంగా రాసింది.
నాన్న, నేను నిన్ను ద్వేషిస్తున్నాను. నువ్వు నన్ను కూతురిగా ఎప్పుడైనా చూశావా, నువ్వు నన్ను ఆటబోమ్మలా ఆడుకున్నావని దివ్యా తన డెత్ నోట్‌లో రాసిందని పోలీసులు అన్నారు. దివ్యా ఆమె అమ్మమ్మ గురించి కూడా రాసింది, మా అమ్మమ్మ నాకు అమ్మా మరియు నాన్నలా ప్రేమను ఇచ్చిందని దివ్యా డెత్ నోట్ రాసింది. నాకు ఇలాంటి నాన్న ఉన్నందుకు సిగ్గుపడుతున్నానని దివ్యా డెత్ నోట్ రాసిందని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications