Railway: మహిళా ప్రయాణికురాలి తలపై మూత్ర విసర్జన చేసిన టీసీ.. చితకబాదిన తోటి ప్రయాణికులు..!

రైలులో ప్రయాణికురాలిపై టీసీ మూత్ర విసర్జన చేశాడు.

అప్పట్లో ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడు మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. ఆ తర్వాత న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ వ్యక్తి పక్కనే ఉన్న మరో ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. తాజాగా ఓ రైల్వే టీసీ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన ఘటన వైరల్ గా మారింది. క్రమశిక్షణతో ఉండాల్సిన ఓ రైల్వే టీసీ అర్థరాత్రి మద్యం మత్తులో రైలులో ఆగం చేశాడు.

ఏకంగా ఓ మహిళా ప్రయాణికురాలి తలపై మూత్ర విసర్జన చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆదివారం అకల్ తఖ్త్ ఎక్స్‌ప్రెస్‌ ఏ1 కోచ్ లో ఓ మహిళ తన భర్త రాజేష్ కుమార్ తో అమృత్ సర్ నుంచి కోల్ కతాకు ప్రయాణిస్తుంది. అర్థరాత్రి రైల్వే టీసీ మున్నా కుమార్ మద్యం మత్తులో బాధితురాలి తలపై మూత్ర విసర్జన చేయడంతో రైలు ఉద్రిక్తత నెలకొంది. ఆగ్రహించిన రైలులోని తోటి ప్రయాణికులు టీసీతో వాగ్వాదానికి దిగారు.

A drunken Railway TC urinated on the head of a female passenger in Train

టీసీని పట్టుకుని చితకబాదారు. అతడిని ఛార్ భాగ్ రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులకు అప్పగించారు. నిందుతుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని బీహార్ కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రైల్వే శాఖ స్పందించింది. ఉద్యోగులు క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+