కిరాతకం:తండ్రిని 36 చోట్ల పొడిచాడు, అడ్డువచ్చిన వారిపై హత్యయత్నం చేశాడు

తండ్రిపై కక్ష పెంచుకొని 36 చోట్ల కత్తితో పొడిచి హత్య చేశాడు ఓ కొడుకు . ప్రవర్తన బాగాలేదని భార్య, తల్లిదండ్రులు అతణ్ని దూరం పెట్టారు.దీంతో ఆయన తండ్రిని విచక్షణరహితంగా పొడిచి చంపాడు.

న్యూఢిల్లీ:అతని ప్రవర్తనతో అందరూ విసిగిపోయారు. అందరూ తనను దూరం చేస్తున్నా ప్రవర్తనను మార్చుకొలేదు.పైగా వారిపై కక్షను పెంచుకొన్నాడు. ఈ కక్షతో వారిని కర్కశంగా చంపేశాడు. కన్నతండ్రి అని కూడ చూడకుండా 36 సార్లు కత్తితో పొడిచి చంపాడు నిందితుడిని అడ్డుకొనేందుకు ప్రయత్నించినవారిపై కూడ అతను దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లిలో చోటుచేసుకొంది.

తండ్రితో పాటు పలువురిపై హత్యయత్నానికి పాల్పడ్డాడు. ఢిల్లీలోని అజంతా అపార్ట్ మెంట్ లో ఆదివారం నాడు రాహుల్ మట్టా అనే మాజీ నేవీ అధికారి తండ్రిని కత్తితో పొడిచి చంపాడు. తన తండ్రిపై 36 చోట్ల కత్తితో పొడిచి చంపాడు. ప్రాణభయంతో ఆయన పక్క గదిలోకి వెళ్ళి దాక్కొన్న ఆయన మాత్రం వదల్లేదు.

తండ్రిని చంపేందుకు ప్రయత్నించిన రాహుల్ ను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన ఇరుగుపొరుగుపై కూడ ఆయన హత్యాయత్నానికి పాల్పడ్డాడు.రాహూల్ ను ఇంట్లోకి వెళ్ళకుండా అడ్డుకొన్న సెక్యూరిటీ గార్డుపై తొలుత దాడి చేశాడు.

a father stabbed 36 times by his son

రాహూల్ ఏ రకంగా వ్యవహరించాడో సిసి కెమెరాల్లో రికార్డు అయింది.రాహూల్ తన తండ్రిని చంపేందుకు ప్రయత్నించగా ఓ మహిళ రాహూల్ ను అడ్డుకొనే ప్రయత్నం చేసింది.ఆమెపై కూడ రాహూల్ దాడి చేశాడు. తర్వాత తండ్రి నివసిస్తోన్న నాలుగో అంతస్థులోకి వెళ్ళి విచక్షణ రహితంగా పొడిచాడు. ఆయన పారిపోయి సెక్యూరిటీ గార్డు గదిలో దాచుకొన్నాడు.

అయినా అతను వదల్లేదు. వెంటాడి చంపేశాడు. మరో ప్లాట్ లోకి వెళ్ళి చొరబడి వారిని బందీలుగా పట్టుకొనేందుకు ప్రయత్నించాడు. తర్వాత వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి నిప్పు పెట్టాడు. రాహూల్ ను పట్టుకొనేందుకు వెళ్ళిన పదిమంది పోలీసులు కూడ గాయపడ్డారు.

తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా రాహూల్ పెళ్ళిచేసుకొన్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టాక భార్య నుండి విడాకులు తీసుకొన్నాడు. అతడి ప్రవర్తన సక్రమంగా లేని కారణంగా తల్లిదండ్రులు కూడ దూరంగా ఉంచారు. రెండు వారాల క్రితం ఆయనను ఇంట్లో నుండి బయటకు పంపారు. రాహుల్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని తండ్రి ప్రకటన చేశాడు. ఈ ఘటనతో కక్ష పెంచుకొన్న రాహూల్ ఈ దారుణానికి ఒడిగట్టాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+