బెంగళూరు: భర్త ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్లడంతో అత్త, మామ అదనపు వరకట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని జీవితంపై విరక్తి చెందిన మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆమె రాసిన డెత్ నోట్ చింపేసిన అత్తా మామ చెత్తకుండిలో పడేశారని పోలీసులు గుర్తించారు.

18 నెలల క్రితం
చిత్రదుర్గకు చెందిన విశ్వనాథ్, మైసూరుకు చెందిన నిర్మలా (24) వివాహం 18 నెలల క్రితం వైభవంగా జరిగింది. విశ్వనాథ్ తన తల్లిదండ్రులు ప్రేమ, నాగరాజ్, భార్య నిర్మలాతో కలిసి బెంగళూరులోని రాజరాజేశ్వరి నగరలోని ఐడీల్ హోమ్స్ ప్రాంతంలోని టెంపుల్ బెల్స్ ప్రీమియర్ అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్నాడు.

జపాన్ లో ఉద్యోగం
విశ్వనాథ్, నిర్మలా దంపతులు అన్యోన్యంగా ఉంటున్నారు. విశ్వనాథ్ ఉద్యోగ రీత్యా జపాన్ వెళ్లి వస్తున్నాడు. ఇటీవల జపాన్ నుంచి వచ్చిన విశ్వనాథ్ బార్య నిర్మలాతో సంతోషంగా గడిపాడు. రెండు రోజుల క్రితమే విశ్వనాథ్ జపాన్ వెళ్లాడు.

ఒక్క రోజులో!
భర్త విదేశాలకు వెళ్లిన తరువాత నిర్మలాను ఆమె అత్త ప్రేమ, మామ నాగరాజ్ అదనపు వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని ఆరోపణలు ఉన్నాయి. బుధవారం రాత్రి అపార్ట్ మెంట్ లోని తన గదిలోకి వెళ్లిన నిర్మలా ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

డెత్ నోట్ చింపేశారు
నిర్మలా ఆత్మహత్య చేసుకునే ముందు డెత్ నోట్ రాసి పెట్టారని పోలీసులు అంటున్నారు. అయితే సాక్షాలు నాశనం చెయ్యడానికి డెత్ నోట్ చింపేసి చెత్త బుట్టలో వేశారని, దానిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.

డెత్ నోట్ అతికించి!
నిర్మలా రాసిన డెత్ నోట్ అతికించిన పోలీసులు ఆమె అత్తా మామ ప్రేమ, నాగనాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని రాజరాజేశ్వరి నగర పోలీసులు చెప్పారు. జపాన్ లో ఉన్న నిర్మలా భర్త విశ్వనాథ్ కు సమాచారం ఇచ్చామని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి Subscribe to Telugu Oneindia.
ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!