మైనింగ్ అడ్డాలో మైండ్ బ్లాక్, ఆంధ్రా బార్డర్ లో ఏం జరిగిందంటే ? ఎన్నికల ఎఫెక్ట్ స్వామి, అంతే !
గనుల గడ్డగా పేరొందిన కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో లోక్ సభ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. లోక్‌సభ ఎన్నికల ముందురోజు పత్రాలు లేకుండా కోట్ల విలువైన డబ్బు, వందల కిలోల బంగారం పట్టుబడింది. ఒకేసారి రూ 5.60 కోట్ల నగదు, 3 కిలోల బంగారం, 103 కిలోల వెండి ఆభరణాలను బళ్లారి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల దెబ్బతో బళ్లారి నాయకులు బిత్తరపోయారు.
కర్ణాలకోని బళ్లారి జిల్లా సరిహద్దులో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లా అయిన అనంతపురం జిల్లాలోని పలు గ్రామాలు ఉన్నాయి. నిత్యం బళ్లారి జిల్లా, ఆనంతపురం జిల్లా ప్రజల ఇరు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు సంచరిస్తుంటారు. వ్యాపార లావాదేవీలు, బంధువుల ఇళ్లకు వెళ్లిరావడంతో పాటు రాజకీయ కార్యకలాపాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. మామూలుగానే ఆంధ్రప్రదేశ్-కర్ణాటక సరిహద్దులోని చెక్ పోస్టుల్లో సోదాలు జరుగుతూనే ఉంటాయి.

లోక్ సభ ఎన్నికలకు తేదీ ప్రకటించిన తరువాత బళ్లారి జిల్లాలో ఇంకా ఎక్కువగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల ప్రధాన రహదారులతో పాటు పలు గ్రామాలకు వెళ్లి వచ్చే ప్రాంతంలో కొత్తగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇలాంటి చెక్ పోస్టుల్లో పోలీసులతో పాటు ఎన్నికల అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు పలు వాహనాల్లో సోదాలు చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో బళ్లారి జిల్లా అధికారులు కోట్ల విలువైన బంగారం, వెండి స్వాధీనం చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం రూ 7. 60 కోట్ల విలువైన డబ్బు, నగలు స్వాధీనం చేసుకున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో జ్యువెలరీ యజమాని నరేష్ ఇంట్లో భారీ మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నరేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు, ఎన్నికల అధికారులు తెలిపారు.

చిక్కమగళూరులో రూ.45 లక్షల నగదు పట్టుబడిన ఘటనలో హవాలా సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు కర్ణాటక పోలీసు చట్టంలోని సెక్షన్ 98 కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కోసం దర్యాప్తును ఆదాయపు పన్ను శాఖకు అప్పగిస్తామని పోలీసు అధికారులు తెలిపారు. కర్ణాటక సరిహద్దులోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుతో పాటు గోవా ప్రాంతాలకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications