భర్తను వదిలేసి కొత్త ఇంట్లో కాపురం పెట్టిన భార్య, ఆంటీని నరికి చంపేసిన అంకుల్ !
చెన్నై/ తేన్ కాశి: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి కావడంతో దంపతులు ఇరు వైపుల కుటుంబ సభ్యులు, బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. దంపతుల మధ్య ఓ విషయంలో గొడవలు ఎక్కువ అయ్యాయి. ఇంటికి వెళ్లిన భర్త కొడవలి తీసుకుని అతని భార్యను దారుణంగా నరికి చంపేయడం కలకలం రేపింది.
తమిళనాడులోి తేన్ కాశి జిల్లాలోని సురండై కామరాజ్ నగర్ లో నవమణి అలియాస్ మణి (53) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం రాజేశ్వరి (43) అనే మహిళను మణి వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన తరువాత మణి, రాజేశ్వరి దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు.

లారీ డ్రైవర్ అయిన మణి బయటకు వెళితే వారం రోజుల తరువాతే అతను ఇంటికి వెలుతున్నాడు. మణి, రాజేశ్వరి దంపతుల కుమార్తెకు వివాహం చెయ్యడంతో ఆమె అత్తారింటిలో ఉంటున్నది. తాను డ్యూటీకి వెళ్లిన తరువాత ఇంటిలో ఒంటరిగా ఉంటున్న తన భార్య రాజేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని భర్త మణికి అనుమానం ఎక్కువ అయ్యింది.
ఇదే విషయంలో మణి, రాజేశ్వరి దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి. రానురాను గొడవలు ఎక్కువ కావడంతో గత ఏడాది భర్త మణి నుంచి విడిపోయిన రాజేశ్వరి వేరే ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్నది. ప్రియుడి మోజులో పడిపోయిన తన భార్య రాజేశ్వరి తనను మోసం చేస్తోందని, అందుకే తనను వదిలేసి వెళ్లిపోయిందని మణి ఇంకా రగిలిపోయాడు.
తన భార్య రాజేశ్వరిని చంపేస్తే తాను ప్రశాంతంగా ఉంటానని మణి అనుకున్నాడు. భార్య రాజేశ్వరి ఇంటికి మణి వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్య రాజేశ్వరితో గొడవ పెట్టుకున్న మణి వెంట తీసుకెళ్లిన కొడవలితో ఆమెను ఇష్టం వచ్చినట్లు నరికేశాడు. తీవ్రగాయాలైన రాజేశ్వరి స్పాట్ లో ప్రాణాలు వదిలేసింది.
భార్య రాజేశ్వరిని హత్య చేసిన మణి ఆమె ప్రాణం పోయిందని నిర్దారించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. తేన్ కాశి ప్రభుత్వ ఆసుపత్రికి రాజేశ్వరి శవం తరలించిన పోలీసులు ఆమె భర్త మణి కోసం వెతికారు. పారిపోయిన మణి చివరికి పోలీసులకు చిక్కిపోయాడు. రాజేశ్వరి తన పరువు తీస్తోందని, అందుకే చంపేశానని మణి అంటున్నాడని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications