Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లేడీ పోలీస్ కు ప్రియుడు, ఇద్దరు పోలీసుల కామపురాణం స్టోరీతో నాలుగు శవాలు !

చెన్నై/మదురై: పెద్దలు సెట్ చేసిన పెళ్లి కావడంతో దంపతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవు. పైగా భార్య పోలీసుగా ఉద్యోగం చేస్తోంది. భర్త బాగా డబ్బులు సంపాధిస్తున్నాడు. సాటి కానీస్టేబుల్ తో అక్రమ సంబందం పెట్టున్న లేడీ పోలీస్ ఎంజాయ్ చేసింది. ప్రియుడి కోసం లేడీ పోలీసు భర్తను కూడా వదిలేసింది. ప్రియుడు వేరే ఆంటీని సెట్ చేసుకున్నాడు. ప్రియుడు మోసం చేశాడని ఆవేదనతో లేడీ పోలీసు ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది.

తమిళనాడులోని మధురైలో జయలక్ష్మి (37) అనే మహిళ నివాసం ఉంటోంది. కొన్ని సంవత్సరాల క్రితం సుబ్బరాజు అనే వ్యక్తితో జయలక్ష్మి వివాహం జరిగింది. సుబ్బరాజు, జయలక్ష్మి దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో పవిత్ర (11) అనే కుమార్తె, కాళిముత్తు (9) అనే కుమాుడు ఉన్నారు. మధురై రైల్వే పోలీస్ స్టేషన్‌లో కొన్ని సంవత్సరాల నుంచి జయలక్ష్మి మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది.

A lady constable who committed suicide with her children while in love with her boyfriend in Madurai.

కొంతకాలం క్రితం జయలక్ష్మి తిరుచ్చి రైల్వే పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయినట్లు సమాచారం. జయలక్ష్మి బాధలో ఉన్నారని కూడా చెబుతున్నారు వేరే ప్రాంతానికి బదిలి కావడంతో జయలక్ష్మి అక్కడికి వెళ్లి అద్దె ఇంటిలో నివాసం ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. లేడీ పోలీసు జయలక్ష్మితో పాటు ఆమె కుమార్తె పవిత్ర, కుమారుడు కాళిముత్తు కూడా ఉన్నారు.

ఇటీవల మనస్థాపానికి గురైన జయలక్ష్మి సాయంత్రం చోళవందన్ బ్లాక్‌లోని తేనూరు సమీపంలో తన కుమార్తె పవిత్ర (11), కాళీముత్తు (9)తో కలిసి మధురై నుంచి దిండిగల్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైలు ఢీకొన్న వేగానికి ముగ్గురి మృతదేహాలు ముక్కలు ముక్కలయ్యాయి.. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మధురై ప్రభుత్వ రాజాజీ ఆస్పత్రికి తరలించారు.

తిరుచ్చికి బదిలీ అయిన తర్వాత జయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని పోలీసుల తొలిదశలో విచారణలో తేలింది. అయితే పోలీసుల విచారణలో మదురై రైల్వే పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన జయలక్ష్మి గతంలో అక్కడే పనిచేసిన హెడ్ కానిస్టేబుల్ కోవిల్‌పట్టికి చెందిన సొక్కలింగ పాండియన్ అలియాస్ పాండియన్ (50)తో అక్రమ సంబందం పెట్టుకుందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

A lady constable who committed suicide with her children while in love with her boyfriend in Madurai.

గత ఆరు సంవత్సరాలు జయలక్ష్మి, పాండియన్ వారిద్దరూ సన్నిహితంగా మెలిగారని, ఒకే చోట ఉద్యోగం చెయ్యడంతో కొంతకాలం ఎవ్వరికి అనుమానం రాలేదని తెలిసింది. భార్య జయలక్ష్మి అక్రమ సంబందం వ్యవహారం ఆమె భర్త సుబ్బురాజ్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవని, భర్త ఎంత చెప్పినా లేడీ పోలీసు జయలక్ష్మి ఆమె పద్దతి మార్చుకోకుండా ప్రియుడు పాండియన్ మోజులో పడిపోందని తెలిసింది.

దీంతో భార్యాభర్తలు జయలక్ష్మి, సుబ్బరాజు మధ్య మనస్పర్థలు వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం విడిపోయి ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారని, ఇద్దరు పిల్లలు జయలక్ష్మి దగ్గరే ఉంటున్నారని సమాచారం. హెడ్ ​​కానిస్టేబుల్ సొక్కలింగ పాండియన్‌కు అప్పటికే బంధువుల అమ్మాయితో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, అతను వేరే ప్రాంతంలో కాపురం ఉంటున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

అయితే సొక్కలింగ పాండియన్ తరచూ జయలక్ష్మి అనే మహిళలతో సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నాడని అతని భార్య వాగ్వాదానికి దిగింది. ఒంటరిగా ఉన్న సొక్కలింగ పాండియన్ జయలక్ష్మితో సన్నిహితంగా మెలిగినట్లు కూడా చెబుతున్నారు. గత ఏడాది పాండియన్‌ను అకస్మాత్తుగా తేన్ కాశి జిల్లాలోని సెంగోట్టై రైల్వే పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. పాండియన్ ఎర్రకోటలో, జయలక్ష్మి మదురైలో ఉండడంతో ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ పెరిగింది.

ఈ స్థితిలో హెడ్ కానీస్టేబుల్ పాండియన్‌కు ఎర్రకోటలో మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని, అందుకే తేన్ కాశికి వెళ్లిన తరువాత తన ప్రియుడు పాండియన్‌ తనకు దూరం అయ్యాడని జయలక్ష్మికి తెలిసింది. ఇదే విషయంలో ప్రియుడు పాండియన్ తో అతని ప్రియుడు జయలక్ష్మి గొడవ పడింది. ఇదే విషయంలో పాండియన్, జయలక్ష్మిల మద్య పెద్ద ఎత్తున గొడవలు జరిగాయని తెలిసింది.

ఇద్దరు తరచూ సెల్ ఫోన్ లో గొడవ పడుతున్నారు. రెండు రోజుల క్రితం పాండియన్ మధురైలోని జయలక్ష్మి ఇంటికి వెళ్లాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వు నన్ను మోసం చేసి వేరే మహిళతో ఎలా అక్రమ సంబందం పెట్టుకుంటావని జయలక్ష్మి ఆమె ప్రియుడు పాండియన్ ను నిలదీసింది. ఆ సందర్బంలో ఇద్దరి మధ్య గొడవ ఎక్కువ అయ్యింది. ఇద్దరి మధ్య గొడవ జరగడం చూసిన ఇరుగుపొరుగు వారు పాండియన్ కు నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు.

A lady constable who committed suicide with her children while in love with her boyfriend in Madurai.

పాండియన్ ఇంటికి వచ్చి గొడవ పడ్డాడని, వీడిని నమ్ముకుని తన భర్త సుబ్బరాజును కూడా వదిలేశానని జయలక్ష్మి ఆవేదన చెందదింది. పాండియన్ ఇంటి దగ్గరకు వచ్చి పెద్ద గొడవ చెయ్యడంతో అవమానంగా భావించిన జయలక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకుని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు.

ఇద్దరు పిల్లలతో సహా జయలక్ష్మి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ప్రియుడు పాండియన్ పోలీసుల విచారణకు భయపడి చెన్నై-తిరుచెందూర్ ఎక్స్‌ప్రెస్ రైలు చతుర్ సమీపంలోని చిన్నక్ ఖిల్డీ ప్రాంతానికి రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. పాండియన్ తల తెగిపోయి రక్తపుమడుగులో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న తూత్తుకుడి రైల్వే పోలీసులు పాండియన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవిల్‌పట్టి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇద్దరి ఆత్మహత్య ఘటనలపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.భర్తతో విడిపోయి ప్రియుడు పాండియన్ చేతిలో మోసపోయి ఇద్దరు పిల్లలతో సహా మహిళా రైల్వే గార్డు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ప్రియురాలు జయలక్ష్మి, ఆమె పిల్లలు ఆత్మహత్య చేసుకోవడంతో రైల్వే హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పాండియన్ రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఇద్దరు పోలీసుల మధ్య అక్రమ సంబందం ఉండటంతో నలుగురి ప్రాణాలు పోవడంతో రైల్వే పోలీసులు హడలిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+