వీడియో: పై ప్రాణాలు పైనే పోయుంటాయ్..!!

Bannerghatta Zoo Park: బెంగళూరులో జూపార్క్‌ సందర్శకులకు వింత అనుభవం ఎదురైంది. ఓ చిరుత సందర్శకుల వాహనంపై దాడి చేసింది. ఆ వాహనంపైకి ఎక్కింది. ఆ వెహికల్ కిటికీని పట్టుకుని కొద్దిసేపు వేలాడుతూ ఉండిపోయింది. ఒక దశలో అతి కిటికీ నుంచి లోనికి తలదూర్చడానికి ప్రయత్నించింది.

బెంగళూరు శివార్లలోని బన్నేరుఘట్ట నేషనల్ పార్క్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సందర్శకులతో నిండిపోయిన ఓ మినీ సఫారీ బస్ అది. సింహాలు, చిరుతలు, ఇతర వన్యప్రాణులను సందర్శకులు మరింత దగ్గరగా చూడటానికి సఫారీ వ్యవస్థ ఇక్కడ అందుబాటులో ఉంది.

A leopard climbed a tourists safari bus in the Bannerghatta Zoo Park in Bengaluru

దసరా పండగ సెలవులు కావడం వల్ల బన్నేరుఘట్ట జూపార్క్‌నకు సందర్శకులు పోటెత్తారు. రోజూ 15,000 మందికి పైగా పర్యాటకులు ఈ జూపార్క్‌ను సందర్శిస్తుంటారు. సెలవుల వల్ల ఈ సంఖ్య మరింత భారీగా ఉంటోంది. 730 హెక్టార్లల్లో విస్తరించిన అనేకల్ అటవీ ప్రాంతంలో వారికోసం రోజూ సఫారీని నిర్వహిస్తుంటారు.

ఇటీవలే సఫారీకి వెళ్లిన ఓ వాహనంపై చిరుత ఇలా దాడి చేసింది. తొలుత రోడ్డుకు అడ్డంగా ఉన్న ఆ చిరుత క్రమంగా సందర్శకుల సఫారీ వాహనం దగ్గరికి మెల్లిగా చేరుకోవడం, కొద్దిసేపటి తరువాత ఒక్క ఉదుటన దాని కిటీకి అద్దాలకు అమర్చిఉన్న రెయిలింగ్‌ను పట్టుకుని వేలాడుతూ ఉండటం ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు.

ఆ సమయంలో అందులో ఉన్న సందర్శకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. గట్టిగా కేకలు వేయడం ఈ వీడియోలో రికార్డయింది. ఒకదశలో ఆ చిరుత లోనికి తలదూర్చే ప్రయత్నం చేయడం కనిపించింది. కొద్దిసేపటి తరువాత అది కిందికి దిగి తన దారిన తాను వెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి అపాయం కలగలేదని జూ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+