సిగరెట్ కోసం గొడవ... దాడిలో ఒకరు మృతి..
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరుగుతున్నాయి. ఆ గొడవలు కాస్తా పెద్దగయ్యి ఒకరినొకరు చంపుకునే పరిస్థితిలు వస్తున్నాయి. అయితే, జూలైలో ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో సిగరెట్ తాగొద్దని వారించినందుకు ఓ యువకుడిపై హత్యయత్నం చేశాడో వ్యక్తి. అప్పట్లో ఈ హత్య కలకలం సృష్టించింది. మహంతీష్ అనే వ్యక్తిని సిగరెట్ తాగొద్దని రంగనాథ్ వారించాడు. దీంతో కోపోద్రిక్తుడైన మహంతీష్ రంగనాథ్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన అతడిని బెంగళూరులోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లా అమరాపురం మండలం శివరంలో చోటుచేసుకుంది. అయితే, ఇలాంటి ఘటనే ఇప్పడు తాజాగా పంజాబ్‌లో చోటుచేసుకుంది. సిగరెట్ కోసం ముగ్గురు వ్యక్తులు గొడవపడగా, అందులో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది.
తలపై పదే పదే కొట్టాడు : పంజాబ్‌లోని జలాలాబాద్‌లోఈ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి రోడ్డు మీద వెడుతూ.. రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై కూర్చుని ఉన్న ఇద్దరిని సిగరెట్ కావాలని అడిగాడు. అందుకు వారు తమ దగ్గర సిగరెట్ లేదని చెప్పారు. దీంతో కోపోద్రుక్తుడై ఆ వ్యక్తి వారిమీద విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ ఇద్దరిలో ఓ వ్యక్తి తలపై పదే పదే కొట్టడం ప్రారంభించాడు. దాంతో అతడు అక్కడిక్కడే నేలపై కుప్పకూలాడు. మరుసటి రోజు ఆ వ్యక్తి స్థానికులకు శవమై కనిపించాడు.

బీడీలు, సిగరెట్‌ల విషయంలో జరిగిన వివాదంలో ఓ వ్యక్తి హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. అక్టోబర్ 28వ తేదీ అర్థరాత్రి బాధితుడు, మరో వ్యక్తి రోడ్డు పక్కన కూర్చొని ఉండగా ఈ సంఘటన జరిగిందని, బాధితుడితో పాటు కూర్చున్న వ్యక్తి తెలిపాడు. అయితే, రాత్రి సమయంలో ఓ వ్యక్తి బీడీలు కావాలంటూ తమ వద్దకు వచ్చాడని అతడు తెలిపాడు. వారు దానికి నిరాకరించడంతో వారు ముగ్గురి మధ్యలో వాగ్వాదం జరిగిందని, వెంటనే ఎదుటి వ్యక్తి హింసాత్మకంగా మారాడని అతను తెలిపాడు.
మరుసటి రోజు శవమై కనిపించాడు : పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు పమ్మా అనే వ్యక్తి తలపై బలంగా పదే పదే కొట్టడంతో పమ్మా అక్కడిక్కికే కుప్పకూలిపోయాడు. అక్కడితో ఆగకుండా నిందితుడు పక్కనే ఉన్న మరో వ్యక్తిపై కూడా దాడికి దిగాడు. మరో వ్యక్తి ఎడమ కన్ను, ముక్కుపై ఇటుకతో బలంగా కొట్టాడు. దాంతో వారిద్దరూ సహాయం కోసం ఎంతగానో అరిచారు. వీరి అరుపులకు నిందితుడు అక్కడి నుంచి పారిపోవడం జరిగిందని పమ్మాతో ఉన్న వ్యక్తి చెప్పాడని, పోలీసులు వివరించారు. ఆ నిందితుడు మళ్లీ వచ్చి ఎక్కడ దాడి చేస్తాడేమోనని తాను కూడా భయపడి అక్కడినుండి పారిపోయానని ఆ వ్యక్తి చెప్పాడని పోలీసులు తెలిపారు. అయితే, ఆ మరుసటి రోజు ఉదయం అదే స్థలంలో పమ్మ శవమై కనిపించడంతో ఆ ప్రాంత వాసుల్లో గుబులు మొదలైంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు.












Click it and Unblock the Notifications