స్వామీజీపై పోక్సో కేసు పెట్టిన బాలిక మాయం, ఇంట్లో ఉన్న అమ్మాయి ఏమైయ్యింది?, చిన్నాన!
కర్ణాటకలోని చిత్రదుర్గ పట్టణ శివార్లలోని మురుగ మఠానికి చెందిన డాక్టర్ శివమూర్తి శరణపై లైంగిక వేదించారని నమోదు అయిన పోక్సో కేసుకు సంబంధించి బాధిత బాలిక తన ఇంటి నుండి బయటకు వెళ్లి మాయం అయ్యిందని సమాచారం బయటకు రావడం హాట్ టాపిక్ అయ్యింది. స్వామీజీ మీద లైంగిక వేధింపుల కేసు పెట్టిన మైనర్ బాలిక ఒక్కసారిగా ఇంటి నుంచి కనపడకుండా పోవడం అనేక సందేహాలకు దారితీసింది.
మురుగ శ్రీ మీద పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక ఆమె చిన్నాన ఇంటి నుంచి అదృశ్యమైనట్లు సమాచారం. మురుగ శ్రీ స్వామీజీ మీద నమోదు అయిన మొదటి ఫోక్సో కేసు మరో మలుపు తిరుగుతుండడంతో బాధితురాలి బంధువులు బాలికపై ఒత్తిడి తెస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి పోక్స్ కేసులో బాధిత బాలిక ఆమె చిన్నానపై కూడా ఫిర్యాదు చేసింది.

తనకు, తన తమ్ముడికి ఇంట్లో తన చిన్నాన శారీరక, మానసిక వేధింపులకు గురిచేశాడని బాధితురాలు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మే 22వ తేదీన బాలిక ఇంటి నుంచి తప్పించుకుని సహచర సంస్థకు వెళ్లింది. బాధిత బాలిక ఆ సంస్థ పదాదికారులతో కలిసి జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ముందుకు వచ్చింది. తనపై జరిగిన అన్యాయం గురించి ఆమె అధికారుల ముందు వాపోయింది.
తరువాత మురుగ మఠం స్వామీజీ తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మాకు రక్షణ కల్పించాలని బాలిక సీడబ్ల్యూసీకి విజ్ఞప్తి చేసింది. ఆ అమ్మాయి సహచర సంస్థకు చెందిన స్టాన్లీతో వచ్చింది. అనంతరం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిణి సవిత చిత్రదుర్గ బాలబాలికల భవనంలో బాధిత బాలికను పరామర్శించినట్లు తెలిపారు.
ఇప్పుడు మురుగశ్రీపై పోక్సో కేసు పెట్టిన బాలిక మాయం కావడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. బాలిక ఎక్కడ ఉంది ?, ఎందుకు ఇంటి నుంచి మాయం అయ్యింది ? అంటూ సంబంధిత పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పపై లైంగిక వేదింపుల ఫిర్యాదు చేసిన మహిళ కూడా ఇటీవల ఆసుపత్రిలో మరణించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications