Road Accident: ఉత్తరాఖండ్‍లో రోడ్డు ప్రమాదం.. బాధితుల్లో ఏపీ వాసులు..
ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ వాహనం నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 6 గురు గల్లంతయ్యారు. తెహ్రీ గర్వాల్ జిల్లాలో, సోన్‌ప్రయాగ్ నుంచి రిషికేశ్‌కు వస్తున్న మాక్స్ వాహనం మలకుంటి వంతెన నుంచి హోటల్ ఆనంద్ కాశీకి మధ్య నదిలో పడిపోయింది.
ఇందుకు సంబంధించి పోలీసు స్టేషన్ ముని ఇసుక అవుట్‌పోస్ట్ బైయాసికి సమాచారం అందింది. వెంటనే పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందం ప్రమాదస్థలికి వెళ్లారు. వాహనంలో డ్రైవర్‌తో సహా 11 మంది ఉన్నారు. ఐదుగురిని రక్షించగా.. ఆరుగు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు కొనసాగుతోంది.

బాధితుల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన దంపతులు ఉన్నట్లు తెలిసింది. భార్యను రక్షించిన రెస్క్యూ టీమ్, భర్త కోసం గాలిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం రాత్రి ఎనిమిది గంటలకు సోన్‌ప్రయాగ్ నుంచి మ్యాక్స్ కారులో బలల్దేరారు.
3 గంటల సమయంలో మలకుంతి వంతెన నుంచి గులార్ వైపు వెళ్లే సమయంలో వర్షంలో కొండపై నుంచి ఒక్కసారిగా రాయి పడడంతో కారు అదుపుతప్పింది. కారు నేరుగా నదిలో పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
గల్లంతైన వారు అందరూ మృతి చెందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే వారు గల్లంతై 9 గంటలు అయిందని అధికారులు చెబుతున్నారు. మరో వైపు భారీ వర్షాల కారణంగా అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. బల్తాల్, పహల్గామ్ మార్గాల్లో అమర్‌నాథ్ యాత్ర వరుసగా రెండో అయిన శనివారం యాత్ర నిలిపివేశారు. శ్రీనగర్ జమ్మూ జాతీయ రహదారిని మూసివేయడం వల్ల యాత్రికులకు ప్రయాణానికి అధికారులు అనుమతి నిరాకరించారు. పలు ప్రాంతాల్లో రోడ్లు కుంగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జూలై 1న యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని పవిత్ర గుహ పుణ్యక్షేత్రంలో 80,000 మందికి పైగా యాత్రికులు పూజలు చేసినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications