పోలీస్ స్టేషన్ లో కొత్త పెళ్లి కూతురిని రేప్ చేసిన ఇన్స్ పెక్టర్, పరుగో పరుగు !
అసోం: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అందరి ప్రేమికుల్లా ఇద్దరూ హ్యాపీగా సినిమాలు, షికార్లకు తిరిగారు. అయితే ప్రేమికుల కులాలు వేరుకావడంతో వారి పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంటి నుంచి పారిపోయిన ప్రేమికులు స్నేహితుల సహాయంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. తరువాత పోలీస్ స్టేషన్ లో అసలు కథ మొదలైయ్యింది.
పోలీస్ స్టేషన్‌లో బాలికను లైంగికంగా వేధించిన తరువాత ఆ మ్యాటర్ బయటకు చెబితే చంపేస్తానని బయటపెట్టిన ఇన్‌స్పెక్టర్‌పై అస్సాం పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అసోంలోని నల్బరీ జిల్లాలోని ఖోగ్రాబర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి ఆమె ప్రియుడిని పెళ్లి చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయింది.

యువతి కుటుంబ సభ్యులు కేసు పెట్టడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు చివరికి ప్రేమికులిద్దరినీ పట్టుకుని ఖోగ్రాబార్ పోలీస్ స్టేషన్ కు పిలుచుకుని వెళ్లారు. ప్రేమికులు ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి రాత్రి లాకప్‌లో ఉంచారు. అప్పుడే 17 ఏళ్ల బాలికపై అదే పోలీస్ స్టేషన్ లో ఉద్యోగం చేస్తున్న ఇన్స్ పెక్టర్ కన్నుపడింది.
అక్కడ పనిచేస్తున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ బిమన్ రాయ్ బాలికను బెదిరించి వివస్త్రను చేశాడు. పోలీస్ స్టేషన్‌లో బాలికను వివస్త్రను చేసి ఫోటోలు తీసిన ఇన్స్ పెక్టర్ బిమన్ రాయ్ ఆమెను లైంగికంగా వేధిస్తూనే ఉన్నాడు. కొత్త పెళ్లికూతురి మీద లైంగిక దాడి చేశాడు. బాధిత బాలిక తనకు ఎదురైన కష్టాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు లేఖ రాసింది.

దీంతో డీఐజీ ప్రజెంజిత్ స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా డీఐజీ పోలీస్ స్టేషన్ కు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ మేరకు అసోం డీజీపీ జీబీ. సింగ్‌కు డీఐజీ నివేదిక సమర్పించారు. యువతి ఫిర్యాదు మేరకు ఇన్స్ పెక్టర్ భీమన్ రాయ్‌ను సస్పెండ్ చేస్తూ అస్సాం డీజీపీ జీబీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రియుడితో పారిపోయి అతన్ని పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే ప్రియురాలి మీద ఇన్స్ పెక్టర్ లైంగిక దాడికి పాల్పడటం అసోంలో కలకలం రేపింది. ఇన్స్ పెక్టర్ బిమన్ రాయ్‌పై పోక్సో సెక్షన్లతో సహ కేసు నమోదు చేశారు. తన మీద కేసు నమోదు చేశారని తెలుసుకున్న ఇన్స్ పెక్టర్ బిమన్ రాయ్ పారిపోవడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌లోనే అమ్మాయి మీద పోలీసు అధికారి లైంగిక దాడి చెయ్యడం కలకలం రేపింది. అయితే కామాంధుడైన ఇన్స్ పెక్టర్ ఆచూకి చెబితే నగదు బహుమానం ఇస్తామని పోలీసు శాఖ ప్రకటించడం హాట్ టాపిక్ అయ్యింది. తాను పోలీసు అధికారి, నేను ఏం చేసినా ఎవ్వరూ పట్టించుకోరని రెచ్చిపోయిన ఇన్స్ పెక్టర్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా మారిపోయాడు.












Click it and Unblock the Notifications