ప్రభుత్వంలో మంచి ఉద్యోగం, ఫ్రెండ్ కూతుర్ని ఏం చేశాడంటే ?, ఎంజాయ్ చేసిన భార్య !
న్యూఢిల్లీ: ఫ్రెండ్ కుమార్తె కూతురితో సమానం. స్నేహితుడి కుమార్తెను కూతురితో సమానంగా చూసుకోవాలి. అయితే ఢిల్లీ ప్రభుత్వ అధికారి అతని స్నేహితుడి టీనేజీ కుమార్తెపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే ప్రభుత్వ అధికారి భార్యపై కూడా కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది.
ఢిల్లీ ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమాభివృద్ధి విభాగానికి చెందిన ఒక సీనియర్ అధికారి ఇప్పుడు అతని స్నేహితుడి టీనేజ్ కుమార్తెపై నెలల తరబడి అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఫోక్సో చట్టం వేధింపుల కేసును ఎదుర్కొంటున్నారు. ఈ కేసును విచారించేందుకు భారత శిక్షాస్మృతిలోని పలు సెక్షన్లు, కఠినమైన పోక్సో చట్టం కింద ఢిల్లీ పోలీసులు సీనియర్ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఇంకా ఆ ప్రభుత్వ అధికారి భార్య కూడా మైనర్ బాలికపై అత్యాచారానికి సహకరించిందనే ఆరోపణలు రావడం కలకలం రేపింది. బాలిక 12వ తరగతి (ఇంటర్ రెండో సంవత్సరం) చదువుతున్నదని పోలీసు అధికారులు తెలిపారు. ఇంటర్ అమ్మాయి 2020లో తన తండ్రిని కోల్పోయింది, ఆ తర్వాత నిందితుడు ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు.
2020 నుంచి 2021 మధ్య కాలంలో ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా బాధిత బాలిక గర్భం దాల్చడంతో నిందితుడు ఈ విషయాన్ని తన భార్యకు చెప్పాడు. పోలీసు ఫిర్యాదులో, అధికారి భార్య తన కొడుకుకు మత్తు మందు ఇవ్వమని కోరిందని, ఇంట్లో తనకు అబార్షన్ చేయించారని బాధితురాలు అయిన మైనర్ బాలిక తెలిపింది.
బాలిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేయాల్సి ఉందని, ప్రభుత్వ ఉన్నతాధికారిపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారని సంబంధిత అధికారులు తెలిపారు. దీంతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిని సస్పెండ్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉత్తర్వులు జారీ చేశారు.

తన ఆశ్రయంలో ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై నిందితుడి భార్య అయిన మహిళా శిశు శాఖ అధికారిని కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే సోమవారం సాయంత్రం 5 గంటలలోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు.
మొత్తం మీద ఓ సీనియర్ పోలీసు అధికారి అతని స్నేహితుడి కుమార్తె మీద పదేపదే అత్యాచారం చెయ్యడమే కాకుండా ఆమెకు అబార్షన్ చేయించడం ఢిల్లీలో కలకలం రేపింది. తండ్రి చనిపోవడంతో ఆయన కుమార్తెను చేరదీస్తున్నట్లు నటించి ఆ అమ్మాయి మీద కామాంధుడు పదేపదే అత్యాచారం చెయ్యడం, అందుకు అతనని భార్య కూడా సహకరించడం ఢిల్లీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది.












Click it and Unblock the Notifications