విదేశీ మహిళపై ఏడు మంది గ్యాంగ్ రేప్, భర్త కళ్ల ముందే దారుణం, బైక్ పర్యటనలో !
జార్ఖండ్‌లోని ధుమ్కాలో శుక్రవారం రాత్రి తన భర్తతో కలిసి బైక్‌పై భారత్ లో పర్యటిస్తున్న స్పెయిన్ మహిళపై ఏడుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శుక్రవారం అర్థరాత్రి హంసదిహ పోలీస్ స్టేషన్ పరిధిలోని కురుమహత్‌లో చోటుచేసుకుంది. 7 మంది కామాంధులు విదేశీ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడటం కలకలం రేపింది.
విదేశీ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నలుగురు నిందితుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. సామూహిక అత్యాచారానికి గురైన విదేశీ మహిళ, ఆమె భర్త ఇద్దరూ బైకర్లే. స్పెయిన్ నుంచి భారత్ వచ్చిన దంపతులు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో బైక్ ల్లో సంచరిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ లో పర్యటన ముగించుకున్న దంపతులు జార్ఖండ్ ప్రాంతం గుండా నేపాల్ చేరుకోవాలని అనుకున్నారని జార్ఖండ్ లోని ధుమ్కా పోలీస్ సూపరింటెండెంట్ పీతాంబర్ సింగ్ ఖైర్వార్ తెలిపారు. రాత్రి ఆలస్యం అవుతుండటంతో విశ్రాంతి కోసం ధుమ్కా వద్ద బైక్‌ను ఆపారు. తరువాత ఇక్కడి కుంజి గ్రామంలో తాత్కాలిక డేరా నిర్మించుకున్న దంపతులు అక్కడే నిద్రపోవాలని అనుకున్నారు.
భోజనం చేసిన తరువాత దంపతులు విశ్రాంతి తీసుకుని మరుసటి రోజు బయలుదేరాలని అనుకున్నారు. స్పెయిన్ జంట నేపాల్ వెళ్లాలంటే బీహార్ లోని భాగల్ పూర్ వెళ్లాల్సి వచ్చింది. అందుకే కుంజి గ్రామంలో రాత్రి బస చెయ్యాలని స్పెయిన్ జంట అక్కడే డేరాలో ఉండిపోయారు. రాత్రి వేళల్లో గస్తీ తిరుగుతున్న పోలీసులకు విదేశీ మహిళ, ఆమె భర్త ఇద్దరూ దాడికి గురై రక్తపుమడుగులో మెయిన్ రోడ్డుపై పడి ఉన్నారని స్థానికులు సమాచారం ఇచ్చారు
విషయం తెలుసుకున్న పోలీసులు దంపతులను రక్షించి ఆ విదేశీ మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు పోలీసు అధికారి ఖైర్వార్ తెలిపారు. దీనిపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ఫోరెన్సిక్ నిపుణులను కూడా నియమించామని పోలీసు అధికారులు తెలిపారు. స్పెయిన్ మహిళ, ఆమె భర్త టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చారు. స్పెయిన్ దంపతులు ఆసియా అంతటా మెగా ట్రిప్‌లో ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.
స్పెయిన్ దంపతులు గతంలో జంటగా పాకిస్థాన్‌ను సందర్శించారు. ధూమ్కా రాకముందే బంగ్లాదేశ్ వెళ్లారని పోలీసులు తెలిపారు. ఇప్పుడు జార్ఖండ్ నుంచి నేపాల్ వెళ్లాలని ప్లాన్ వేసుకున్నారు. స్పెయిన్ మహిళ ప్రస్తుతం సరయ్యహత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ) ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసు అధికారులు ఖైర్వార్ తెలిపారు.
శుక్రవారం అర్దరాత్రి సామూహిక అత్యాచారం జరిగిన ప్రాంతానికి వెళ్లి అక్కడే మకాం చేశారు. కేసు దర్యాప్తు జరుపుతున్నామని, అరెస్టు చేసిన ముగ్గురు నిందితులను విచారిస్తున్నామని ఖైర్వార్ తెలిపారు. స్పెయిన్ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిందని తెలిసుసుకున్న స్థానికులు నిందితులప కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications