Manipur: మణిపూర్‍లో ఉన్న తెలంగాణ వారి కోసం ప్రత్యేక విమానం.. ఎప్పుడంటే..!
మణిపూర్ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మణిపూర్ లో చెలరేగిన హింసలో ఇప్పటికే 52 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి ఎన్. బీరేన్ సింగ్ ఎలాంటి హింస పాల్పడకుండా శాంతంగా ఉండాలని ప్రజలను కోరారు. చురచంద్‌పూర్‌లో మెజారిటీ మెయిటీ కమ్యూనిటీ, కుకీ తెగ మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ మణిపూర్ (ATSUM) పిలుపునిచ్చిన 'గిరిజన సంఘీభావ యాత్ర' సందర్భంగా మణిపూర్‌లో మొదట హింస చెలరేగింది.
ఏప్రిల్ 19 మణిపూర్ హైకోర్టు ఆదేశాలను అనుసరించి రాష్ట్రంలోని మెయిటీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) కేటగిరీలో చేర్చాలనే డిమాండ్‌కు నిరసనగా మార్చ్ నిర్వహించారు. గత 12 గంటల్లో ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో గృహదహనాలు, దిగ్బంధాలు వంటి చెదురుమదురు ఘటనలు చోటుచేసుకున్నా, పరిస్థితి అదుపులోనే ఉందనని డిఫెన్స్ అధికారులు చెప్పారు. అయితే ఆ ఘటనల వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు.

గిరిజన, గిరిజనేతర తెగల మధ్య చోటు చేసుకున్నట్టు చెబుతున్న ఈ ఘర్షణల్లో పలువురు మరణించగా, సుమారు 100 మంది గాయపడినట్టు అనధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పోలీసులు మాత్రం ఈ ఘటనలను ధ్రువీకరించడం లేదు. సుమారు 13,000 పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు రక్షణ వర్గాలు తెలిపాయి.శాంతిభద్రతల దృష్ట్యా మణిపూర్‌లో ఆదివారం జరగాల్సిన నీట్-యుజి పరీక్షను వాయిదా వేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) శనివారం ప్రకటించింది.
మణిపుర్‌లో ఉంటున్న తెలంగాణవాసులు, విద్యార్థుల కోసం రాష్ట్ర సర్కార్ ఆదివారం మధ్యాహ్నం ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. మణిపుర్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అక్కడున్న తెలంగాణ వారి కోసం ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేశారు. తెలంగాణకు చెందిన 250 మంది విద్యార్థులు ఇంఫాల్ , సమీప ప్రాంతాల్లో ఉన్నట్టు తెలిసింది. వారందరినీ తక్షణమే వాయుమార్గంలో తరలించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుని ఆదివారం మద్యాహ్నం ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. మణిపూర్ సీఎస్‌తో మాట్లాడిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాష్ట్ర విద్యార్థులు క్షేమంగా వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications