Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sonia Gandhi: మహిళా రైతులతో సోనియా గాంధీ డ్యాన్స్.. వైరల్ అయిన వీడియో..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హర్యానాకు చెందిన మహిళా రైతులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జులై 8న హర్యానాలోని సోనేపట్‌లోని మదీనా గ్రామంలో వరి పొలాలను సందర్శించిన సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆ మహిళా రైతులతో సంభాషించారు. ఆ మహిళా రైతులు ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని చూడాలనే కోరికను వ్యక్తం చేశారు.

లోక్‌సభకు అనర్హత వేటు వేయడం, న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచి బయటకు వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ మహిళాలకు వివరించారు. అయితే సోనియా గాంధీ ఆ మహిళా రైతులను మధ్యాహ్న భోజనానికి ఆహ్వానించారు. వారికి రవాణా ఏర్పాట్లు కూడా చేశారు. కాంగ్రెస్ కార్యకర్త రుచిరా చతుర్వేది వారిని హర్యానా నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆదివారం సోనియా గాంధీ నివాసంలో భోజనం చేశారు. సోనియా గాంధీతో మాట్లాడారు. సోనియా మహిళా రైతులతో కలిసి డ్యాన్ చేశారు.

A video of Sonia Gandhi dancing with women farmers has gone viral on social media

ఇందుకు సంబంధించిన వీడియోను రుచిరా చతుర్వేది ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. "హర్యానాకు చెందిన మహిళా రైతులు ఢిల్లీని, రాహుల్ ఇంటిని చూడాలని రాహుల్ గాంధీని కోరారు. తన ఇంటిని ప్రభుత్వం లాక్కుందని రాహుల్ చెప్పాడు" అని ట్వీట్ చేశారు. రైతులే భారతదేశానికి బలం అని, వారి మాటలు విని, వారి అభిప్రాయాన్ని అర్థం చేసుకుంటే దేశంలోని అనేక సమస్యలు పరిష్కారమవుతాయని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు.

గాంధీ వరి పొలాలను సందర్శించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సుమారు 12 నిమిషాల యూట్యూబ్ వీడియోలో అతను రైతులు, వారి కుటుంబాలతో సంభాషించడం, పొలాలను దున్నడం, వరి నారు నాటడం ఉంది. "రైతులే భారతదేశానికి బలం" అని హిందీలో ట్వీట్ చేస్తూ, వీడియో పోస్ట్ చేశారు. "హర్యానాలోని సోనేపట్‌లో, నేను ఇద్దరు రైతులను కలిశాను. సంజయ్ మాలిక్, తస్బీర్ కుమార్. వారు చిన్ననాటి మంచి స్నేహితులు మరియు చాలా సంవత్సరాలు కలిసి వ్యవసాయం చేస్తున్నారు" అని రాహుల్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+