ఐదేళ్లుగా కడుపులో కత్తితో నరకం అనుభవిస్తున్న యువకుడు..
వైద్యులని దేవుళ్లతో సమానంగా చూస్తాం. కానీ, ఆ వైద్యులే నిర్లక్ష్యం పేరుతో రోగుల ప్రాణాలను బలితీసుకుంటే ఎలా..వైద్యం చేసి బతికించాల్సిన వైద్యులే నిర్లక్ష్యంతో రోగుల ప్రాణాల మీదకి తెచ్చిన సంఘటలను చాలానే చూశాం. అయితే, ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఓ వైద్యుడి నిర్లక్ష్యం... ఐదేళ్లుగా ఓ యువకుడిని నరకంలో ఉండేలా చేసింది..
పరీక్షించకుండానే.. టాబ్లెట్లు ఇచ్చారు : ఈ ఘటన గుజరాత్‌లోని భరుచ్ జిల్లా అంకాలేశ్వర్‌లో చోటుచేసుకుంది. కత్తిపోట్లకు గురైన వ్యక్తిని సరిగా పరీక్షించకపోవడంతో ఓ యువకుడు గత ఐదేళ్లకుగా నరకం అనుభవించాడు. విపరీతమైన కడుపునొప్పితో ఆ యువకుడు అనేక రకాల ఆస్పత్రులు తిరిగిన అసలు విషయం ఎవ్వరూ అతనికి చెప్పలేదు. కడుపునొప్పితో ఆ యువకుడు ప్రతి రోజూ నరకం అనుభవించేవాడు. అంకాలేశ్వర్‌లో స్థానికంగా ఉండే అతుల్ గిరి అనే యువకుడు ఐదేళ్ల క్రితం కత్తిపోట్లకు గురయ్యాడు.

ఆ సమయంలో వెంటనే అతనిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. భరూచ్ సివిల్ ఆస్పత్రిలో వైద్యులు అతడిని సరిగా పరీక్షించకుండానే కొన్ని టాబ్లెట్లు ఇచ్చి ఇంటికి వెళ్లిపొమ్మన్ని చెప్పారు. ఆ తర్వాత ఆ యువకుడికి కొద్ది రోజులకి వీపరితమైన కడుపునొప్పి మొదలయ్యింది. కడుపునొప్పి తాళలేక ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగాడు. ఎన్నో మందులు వాడాడు. అయినా ఆ యవకుడికి నొప్పి తగ్గలేదు. ఐదేళ్లుగా ఆ కడుపునొప్పితో నరకం అనుభవించాడు.
అతుల్ కడుపులో కత్తిని గుర్తించిన వైద్యులు : ఇటీవల అతుల్ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. అయితే అతుల్ కుటుంబసభ్యులు అతనిని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఐదేళ్లుగా కడుపునొప్పితో ఎంతో నరకం అనుభవిస్తున్న విషయాన్ని అతుల్ అక్కడి వైద్యులకు వివరించాడు. దీంతో ఎక్స్-రే తీసిన వైద్యులు షాక్‌కి గురయ్యారు. అతుల్ కడుపులో కత్తి ఉంది. ఆ కత్తిని చూసి అక్కడివారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే, అతుల్‌కు శస్త్ర చికిత్స నిర్వహించి కత్తిని బయటకు తీస్తామని వైద్యులు తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లోనే సర్జీరీ చేయనున్నట్టు వైద్యులు వెల్లడించారు. ఎట్టకేలకు ఆ యువకుడు కడుపునొప్పి బాధ నుంచి విముక్తి పొందనున్నాడు.












Click it and Unblock the Notifications