ముస్లీం యువకుడితో లవ్, కూతురికి తల్లి సపోర్టు, రాత్రి కన్న కొడుకు ఏం చేశాడంటే ?

ముస్లిం యువకుడితో ప్రేమాయణం సాగిస్తున్న సోదరిని, కూతురికి వత్తాసు పలుకుతున్న తల్లిని ఓ యువకుడే హతమార్చిన షాకింగ్ ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా మరూర్ గ్రామంలో చోటుచేసుకుంది. హరిక్యాతనహళ్లిలో నివాసముంటున్న ధనుశ్రీ (19), ఆమె తల్లి అనితా (40) అనే మహిళ కొడుకు చేతిలో హత్యకు గురికావడంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఈ కేసులో నిందితుడు నితిన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తన సోదరి ధనుశ్రీ ముస్లిం యువకుడిని ప్రేమిస్తున్నందుకు నితిన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ విషయమై పలుమార్లు ధనుశ్రీతో గొడవ పడిన నితిన్ నువ్వు పద్దతి మార్చుకోకపోతే నీ అంతు చూస్తానని బెదిరించేవాడు. గొడవ జరిగిన ప్రతిసారీ ఆమె తల్లిదండ్రులు జోక్యం చేసుకొని వారిద్దరినీ శాంతింపజేశారు.

A young man who killed his sister and mother in a pond was angry that she was in love with a Muslim youth.

ముస్లిం అబ్బాయితో ప్రేమాయణం కొనసాగించవద్దని తల్లిదండ్రులు కూడా ధనుశ్రీకి ఇప్పటికే చాలాసార్లు సూచించారు. తల్లిదండ్రులు, సోదరుడు నితిన్ ముస్లీం యువకుడిని ప్రేమించకూడదని, పద్దతి మార్చుకోవాలని పదేపదే చెప్పినా ధనుశ్రీ ఏమాత్రం పట్టించుకోకుండా ఆమె ప్రియుడితో కలిసి తిరగడం మొదలుపెట్టింది. మంగళవారం సాయంత్రం నిందితుడు నితిన్ సమీపంలోని గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాలని చెల్లెలు ధనుశ్రీ,, తల్లి అనితాను నమ్మించాడు.

తరువాత ధనుశ్రీని, తల్లి అనితా నితిన్ అతని బైక్‌పై ఇంటి నుంచి తీసుకెళ్లాడు. మారూరు చెరువు సమీపంలో బైక్‌ను నిలేసిన నితిన్ తన సోదరి ధనుశ్రీని పట్టుకుని చితకబాది ఒక్కసారిగా చెరువులోకి తోసేశాడు. కొడుకు నితిన్ ను అడ్డుకుని కూతురిని రక్షించడానికి వచ్చిన తల్లి అనితాను కూడా నిందితుడు నితిన్ అదే చెరువులోకి తోసేశాడు. అయితే కొంత సమయం తర్వాత షాక్ నుంచి తేరుకున్న నిందితుడు నితిన్ అతని తల్లి అనితాను మాత్రం రక్షించేందుకు ప్రయత్నించాడు.

కానీ అప్పటికి సమయం మించిపోవడంతో తల్లి అనితా కూడా చెరువులో మునిగిపోవడంతో నితిన్ హడలిపోయాడు. గంట తరువాత చెల్లెలు ధనుశ్రీ, తల్లి అనితా చెరువులో పడి చనిపోయారని నిర్దారించుకున్న తరువాత నితిన్ తడి బట్టలతో ఇంటికి వెళ్లి అతని తండ్రి సతీష్ ముందు ఏడుస్తూ కుర్చున్నాడు. ఏమైందని తండ్రి సతీష్‌ పదేపదే కుమారుడు నితిన్ ప్రశ్నించగా తాను తన తల్లి అనితా, సోదరి ధనుశ్రీని చెరువులో తోసేసి చంపేశానని నేరం ఒప్పుకున్నాడు.

A young man who killed his sister and mother in a pond was angry that she was in love with a Muslim youth.

ఏడు నెలలుగా నితిన్ తన సోదరితో మాట్లాడలేదని అతని సతీష్ చెప్పాడు. ఏ విషయంలోనూ ఒకరితో ఒకరు గొడవ పడవద్దని తాము పదేపదే పిల్లలకు చెప్పామని, ఈ సమస్య పరిష్కరిస్తాం అని చెప్పినా ధనుశ్రీ కాని, నితిన్ కాని మా మాట వినలేదని సతీష్ బంధువుల ముందు వాపోయాడు. చెల్లి ధనుశ్రీతో గొడవ పడితే నువ్వు ఇంటికి రావద్దని తాము కొడుకును హెచ్చరించామని, దీంతో నితిన్ ఆరు నెలల నుంచి మా ఇంటిని విడిచిపెట్టి విడివిడిగా నివసించేవాడని సతీష్ చెప్పాడు.

మంగళవారం రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చిన నితిన్ మైసూరులో నివాసం ఉంటున్న మామయ్యకు ఆరోగ్యం బాగాలేదని, అర్జంట్‌గా వెళ్లి చూద్దామని మాకు చెప్పాడని, దాంతో బైక్‌కు పెట్రోల్‌ పట్టించేందుకు తాను బయటకు వెళ్లానని, ఇంటికి వచ్చేసరికి నితిన్ ఒక్కడే ఉన్నాడని, ఆ సమయంలో మీ అమ్మ, చెల్లెలు ఎక్కడున్నారని తాను అడిగానని, తర్వాత నితిన్ నన్ను చెరువు దగ్గరకు తీసుకెళ్ళి అందులో పడి వాళ్లు చనిపోయారని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడని సతీష్ చెప్పాడు.

తరువాత సతీష్ అతని బంధువుల వద్దకు వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. బుధవారం సాయంత్రం. అగ్నిమాపక సిబ్బంది చెరువులో నుంచి ధనుశ్రీ, ఆమె తల్లి అనితాల మృతదేహాలను వెలికి తీసి ఆసుపత్రికి తరలించారు. గురువారం ఇద్దరి మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ముస్లీం యువకుడి ప్రేమ విషయంలో తల్లీ, కూతురు హత్యకు గురికావడం మైసూరులో కలకలం రేపింది. ఇంత జరగడానికి కారణం అయిన ముస్లీం యువకుడు పారిపోయాడని పోలీసులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+