Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఆధార్‌ లేకుండానే ఐటీ రిటర్న్స్‌, కారణమిదే!

ఆదాయపన్నును మాన్యువల్‌గా చాలామంది చెల్లించారు. ఆధార్‌కార్డు వివరాలు తెలపడం ఇష్టంలేని చాలామంది పన్ను చెల్లింపులకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.

న్యూఢిల్లీ:ఆదాయపన్నును మాన్యువల్‌గా చాలామంది చెల్లించారు. ఆధార్‌కార్డు వివరాలు తెలపడం ఇష్టంలేని చాలామంది పన్ను చెల్లింపులకు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. జూన్ 30వ, తేది తర్వాత ఆదాయపుపన్నులను జూన్ 30వ, తేదికి ముందే మ్యాన్యువల్‌గా చెల్లించారు.

ఆధార్‌కార్డు ద్వారా ఈ ఏడాది జూలై తర్వాత ఆదాయపు పన్ను చెల్లించాలని కొత్తగా ప్రభుత్వం నిబంధనలను తెచ్చింది. అయితే ఈ నిబంధన పరిధిలోకి రాకుండా ఉండేందుకుగాను ఈ ఏడాది జూన్ 30వ, తేదిలోపుగానే మ్యాన్యువల్‌గా ఐటీ రిటర్న్స్ చెల్లించారు.

అయితే జూన్ 30వ, తేదికి ముందు ఐటీ రిటర్న్స్‌కు ఆధార్‌కార్డు తప్పనిసరి కాదు. ఎక్కువమంది తమ పన్నులను ముందుగానే చెల్లించారు. ఈ ఫిల్లింగ్ వ్యవస్థలో లోపం కారణంగానే ఆధార్‌కార్డు లేకపోతే ఆన్‌లైన్‌లో చెల్లించడానికి ఈ-ఫిల్లింగ్ వ్యవస్థలో వీలుకాదు.

Aadhaar rebels find ways to avoid PAN linkage

కొన్ని సందర్భాల్లో ధరఖాస్దు సైతం తిరస్కరణకు గురికానుంది. కానీ, రూ.5 లక్షల ఆదాయం ఉన్నవారు ఖచ్చితంగా తమ ఆధార్‌కార్డు నెంబర్‌ను జత చేయాల్సి ఉంటుంది. అయితే ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలు లీక్ అవుతున్నాయని పలువురు ఆందోళన చెందుతున్నారు.

ఆధార్‌కార్డులతో బ్యాంకు ఖాతాలను లింక్ చేసుకోకపోతే ఖాతాలను స్థంబింపజేస్తామని బ్యాంకులు హెచ్చరించాయి. డేటా లీక్ అయ్యే పరిస్థితి ఉందని చాలామంది ఆసక్తి చూపడం లేదు. మరోవైపు ఓటర్‌కార్డుతో జత చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఆదాయపన్ను చట్టం సెక్షన్ 139 ఏఏ ప్రకారంగా ఆధాయపు రిటర్న్స్ ధరఖాస్తుకు జూలై నుండి ఆధార్ నెంబర్ తప్పనిసరి చేసింది. జూన్ 9న, సుప్రీంకోర్టు బెంచ్ దీన్ని సమర్ధించింది. అయితే ఆధార్ సమాచారభద్రతపై వచ్చిన పలు సందేహలను పరిగణనలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు దాన్ని తాత్కాలికంగా రద్దుచేసింది.కానీ, పాన్‌కార్డును తప్పనిసరి చేసింది.

విదేశీయులు, అస్సాం, మేఘాలయ, జమ్మూకాశ్మీర్‌లో ఉంటున్న 80 ఏళ్ళకు పైబడినవారు ఆధార్‌కార్డును జతపర్చాల్సిన అవసరం లేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+