బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Aagnipath: అగ్నిపథ్ ఎఫెక్ట్, బెంగళూరులో హైఅలర్ట్, రైళ్లు రద్దు, కేఎస్ఆర్ టీసీ, ఆంధ్రా, తెలంగాణ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన అగ్నిపథ్ పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. పలు రాష్ట్రాల్లో రైల్వేస్టేషన్లు వద్ద యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసింది. పలు రాష్ట్రాల్లో రైలు సంచారం పూర్తిగా నిలిపివేశారు. కేఎస్ఆర్ టీసీ బస్సు సంచారంలో ఎలాంటి మార్పులు చెయ్యలేదని అధికారులు తెలిపారు.

Illegal affair: ప్రియురాలితో ఎంజాయ్ చేసి అక్కడే చంపేశాడు, 11 ఏళ్ల క్రితం భార్యను చంపి తీహార్ జైల్లో!Illegal affair: ప్రియురాలితో ఎంజాయ్ చేసి అక్కడే చంపేశాడు, 11 ఏళ్ల క్రితం భార్యను చంపి తీహార్ జైల్లో!

ఐటీ హబ్ బెంగళూరు నగరంలో కూడా పలు రైళ్ల సంచారాన్ని రద్దు చేశారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా బెంగళూరు నుంచి శనివారం బయలుదేరవలసిన రైళ్ల సంచారాన్ని రైల్వే అధికారులు రద్దు చేశారు. క్రాంతివీర సంగోళ్ళి రాయణ్ణ (కేఎస్ఆర్) రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరవలసిన దానాపుర సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు సంచారాన్ని రద్దు చేశారు.

Aagnipath: Protest agianst Agnipath Scheme, train service affected in Bengaluru city in Karnataka.

యశవంతపురం నుంచి భగల్పూర్ వెళ్లవలసిన ప్రత్యేక సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు, యశవంతపురం నుంచి పాటలిపుత్రకు వెళ్లవలసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలుతో పాటు పలు రైళ్ల సంచారాన్నిరద్దు చేశారు. బెంగళూరు నుంచి వివిద రాస్ట్రాలకు వెళ్లవలసిన రైళ్ల సంచారాన్ని రద్దు చేశామని ముందుగా ప్రయాణికులకు సమాచారం ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు.

Shock: మరిది మర్మాంగం మీద వేడినీళ్లు పోసిన వదిన, ఆసుపత్రిలో లబోదిబో, మరది భార్య ఎంట్రీ !Shock: మరిది మర్మాంగం మీద వేడినీళ్లు పోసిన వదిన, ఆసుపత్రిలో లబోదిబో, మరది భార్య ఎంట్రీ !

బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రకు వెలుతున్న కేఎస్ఆర్ టీసీ బస్సుల సంచారం యధావిధిగా కొనసాగుతున్నాయని, కేఎస్ఆర్ టీసీ బస్సుల సంచారం రద్దు చెయ్యలేదని సంబంధిత అధికారులు తెలిపారు. రైల్వే స్టేషన్లలో ఆందోళనకు దిగిన కొందరు అల్లరి మూకలు లూటీలు చేశారని ఇప్పటికే పోలీసులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా బెంగళూరు నుంచి బయలుదేరవలసిన రైళ్ల సంచారాన్ని అధికారులు రద్దు చేశారు.

English summary
Aagnipath: Protest agianst Agnipath Scheme, train service affected in Bengaluru city in Karnataka
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X