సచిన్, రేఖలపై నేను వ్యాఖ్యానించను: అమీర్ ఖాన్
న్యూఢిల్లీ: తనను రాజ్యసభకు నామినేట్ చేస్తామని అడిగారని బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ తెలిపారు. దాని గురించి తాను ఆలోచిస్తానన్నారు. రాష్ట్రపతి నామినేట్ చేసే రాజ్యసభ సభ్యత్వం తనకు దక్కితే, రోజు సభకు హాజరవుతానని ఆమిర్ ఖాన్ అన్నారు.
క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటి రేఖ లాగా మీకూ రాజ్యసభ నామినేషన్ ఇస్తే సంతోషిస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ "వాళ్ళు నా స్నేహితులు. వాళ్లేం చేస్తున్నారనే దానిపై నేను వ్యాఖ్యానించను. నా విషయంలో ఆలోచిస్తానని మాత్రమే చెప్పాను" అని సమాధానమిచ్చాడు అమీర్ ఖాన్.

రాష్ట్రపతి కోటాలో ఎంపీలుగా మారిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి రేఖలపై స్పందించాలన్న ‘ఇండియా టుడే' వ్యాఖ్యాత విన్నపాన్ని నిరాకరించిన ఆమీర్ ఖాన్, సభా సమావేశాలకు గైర్హాజరవుతున్న వారి తీరుపై పరోక్షంగా స్పందించారు. టీవి ఛానళ్లలో అమీర్ ఖాన్ సత్యమేవజయతే పేరుతో పలు సామాంజింకాశాలపై విశ్లేషణాత్మక కార్యక్రమాలు ప్రసారం చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications