ఉచిత బస్సు ఎఫెక్ట్ - ఆర్టీసీకి రూ 4 వేల కోట్ల బకాయిలు, వాట్ నెక్స్ట్..!!

ఉచిత బస్సు పథకం ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఈ పథకాన్ని మహిళలు పెద్ద సంఖ్యలో వినియోగించుకుంటున్నారు. పెరుగుతున్న ఆదరణతో ప్రభుత్వం పైన భారం పెరుగుతోంది. ఇదే సమయంలో మరిన్ని సర్వీసుల్లోనూ ఈ పథకం విస్తరించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆర్టీసీకి ఉచిత ప్రయాణం ఖర్చు ప్రభుత్వం రియంబర్స్ చేస్తోంది. దీంతో.. ఆర్టీసీకి ఆదాయం పెరిగినట్లు తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ప్రభుత్వం నుంచి బకాయిలు భారీ మొత్తంలో ఉండటంతో ఇప్పుడు కర్ణాటక ఆర్టీసీ మనుగడ పైన ప్రభావం చూపుతోంది.

మహిళలకు ఉచిత బస్సు దక్షిణాదిన కర్ణాటక, తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అమలు చేస్తు న్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ ఈ పథకానికి ఆదరణ పెరుగుతోంది. కర్ణాటకలో ఇప్పుడు ఈ పథకం నిర్వహణ ఆర్టీసీకి భారంగా మారుతోంది. కర్ణాటకలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల వేళ ఇచ్చిన 5 గ్యారెంటీలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి.

Above Rs 4000 cr due for RTC to the Free bus for Women Scheme implementation

ఐదు గ్యారెంటీల్లో భాగంగా తీసుకొచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం (శక్తి స్కీమ్‌) ఆర్టీసీ సంస్థకు గుదిబండగా మారింది. 2023లో ప్రారంభించిన శక్తి స్కీమ్‌ కింద మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నప్పటికీ, ఆర్టీసీకి చెల్లించాల్సిన సుమారు రూ. 4,006.47 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానంగా వెల్లడించింది.

పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉండటంతో కర్ణాటక స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (కేఎస్‌ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (బీఎంటీసీ), నార్త్‌ వెస్టర్న్‌ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌డబ్ల్యూకేఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (కేకేఆర్టీసీ) నిర్వహణ సమస్యగా మారుతోంది. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో తాము బస్సులను నడుపలేని పరిస్థితికి వచ్చినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వడానికి సైతం ఇబ్బందులు తప్పవనే చర్చ సాగుతోంది. ఈ పథకం ప్రారంభించిన తరువాత 2023-24 రూ.1,180.62 కోట్లు, 2024-25 రూ.1,170.45 కోట్లు, 2025-26 రూ.1,655.4 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందని అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+