వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను తిట్టండి, నా కుమారుడిని ఏమీ అనొద్దు: మాల్యా

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: కావాలంటే తనను తిట్టుకోండనీ, తన కుమారుడిని మాత్రం ఏమీ అనొద్దని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా విజ్ఞప్తి చేశాడు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైన విజయ్ మాల్యా లండన్‌కు పారిపోయిన సంగతి తెలిసిందే.

భారత్‌ నుంచి పారిపోయిన తర్వాత రుణాల చెల్లింపు కేసులో తన కుమారుడు సిద్దార్థ్‌ మాల్యాను లక్ష్యంగా చేసుకుని పలువురు ట్విట్టర్‌లో దూషిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై విజయ్ మాల్యా మండిపడ్డారు. తాజాగా తన కుమారుడు సిద్ధార్ద్ మాల్యాపై స్పందించాడు. తన వ్యాపారాల్లో తన కుమారుడికి ఏం సంబంధం లేదని, అతడిని ఈ వివాదంలోకి లాగొద్దని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.

తన కొడుకు సిద్ మీద అనవసరంగా ద్వేషభావం చూపొద్దని, తిట్టొద్దని తెలిపాడు. అతడికి తన వ్యాపారంతో ఏమాత్రం సంబంధం లేదని, మీకు తప్పనిసరి అయితే తన మీద తిట్ల వర్షం కురిపించాలి గానీ అతడిమీద కాదని అన్నాడు. కావాలంటే తనను ఏమైనా అనొచ్చు గానీ కుర్రాడిని ఎందుకని ట్వీట్ చేశాడు.

''బ్యాంకులకు బకాయిలు చెల్లించి గౌరవం నిలుపుకోండి.. లేదంటే చర్యలు తప్పవు'' అంటూ విజయ్ మాల్యాను ఉద్దేశించి ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. బకాయిలు చెల్లించకుంటే బ్యాంకులు, విచారణ సంస్థలు తీసుకొనే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని జైట్లీ సూచించారు.

బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను చెల్లించిన కేసులో విజయ్ మాల్యా మార్చి 2న భారత్‌ వదిలి లండన్‌ వెళ్లిపోయారు. దీంతో మార్చి 18న మాల్యా కోర్ట్‌లో హాజరుకావాలని ఈడీ మాల్యాకు సమన్లు జారీచేసింది. మార్చి నెలలో భారత్‌ రాలేనని ఏప్రిల్‌లో హాజరవుతానని మాల్యా న్యాయస్థానానికి దరఖాస్తు చేసుకున్నారు.

English summary
Liquor baron Vijay Mallya has come out in defence of his son Siddharth. Mallya has said that Siddharth must not be dragged into any controversy as he had absolutely no connection with his father's 'business'.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X