‘ఫిర్యాదు వెనక్కితీసుకోకుంటే మళ్లీ రేప్ చేస్తా’
ముజఫర్‌నగర్: అత్యాచార బాధితురాలికి నిందితుడి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. పోలీస్ స్టేషన్‌లో తమపై ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోకుంటే మరోసారి అత్యాచారానికి పాల్పడతామని బాధితురాలిని రేప్ నిందితుడు ఆమెను బెదరింపులకు గురిచేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్ జిల్లా కుర్వారాలో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఆగస్టు 21న అంకుర్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు కుటుంబసభ్యుల సహాయంతో పోలీసులను ఆశ్రయించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, ఇంతలోనే నిందితుడి నుంచి బాధితురాలికి బెదిరింపులు వచ్చాయి. దీంతో సోమవారం మరోసారి అదే నిందితుడిపై ఫిర్యాదు చేసింది బాధితురాలు.
రెండురోజుల క్రితం రాత్రి బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెను కలిసిన నిందితుడు అంకుర్.. తనపై పెట్టిన కేసును వెనక్కి తీసుకోకుంటే మరోసారి రేప్ చేస్తానని బెదరించాడు. ఈ మేరకు బాధితురాలి ఫిర్యాదుతో ప్రత్యేక బృందంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications