నటి పూనమ్‌కు తీవ్ర గాయాలు: ఆసుపత్రిలో అడ్మిట్: భర్త అరెస్ట్
ముంబై: ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. తీవ్ర గాయాలతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ముంబైలోని ఓ టాప్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. శరీరంపై పలు చోట్ల ఆమెకు గాయాలయ్యాయని, చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెప్పారు. ముఖం, చేతులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనలో ఆమె భర్త సామ్ బోంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై గృహ హింస కింద కేసు నమోదు చేశారు.

గత ఏడాదే పెళ్లి
పూనమ్ పాండే ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు సామ్ బోంబేను అరెస్ట్ చేశారు. సామ్ బోంబే అసలు పేరు సామ్ అహ్మద్. గత ఏడాదే అతను పూనమ్ పాండేను వివాహం చేసుకున్నాడు. గత ఏడాది జులై 27వ తేదీన వారిద్దరికీ ఎంగేజ్‌మెంట్ అయింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అదే ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన వివాహం చేసుకున్నారు. అంతకుముందు రెండు సంవత్సరాలుగా వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. సహజీవనం చేశారు.

కేసు పెట్టడం రెండోసారి..
వివాహమైన కొద్దిరోజులకే పూనమ్ పాండే తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. హనీమూన్ కోసం గోవా వెళ్లిన సమయంలో భర్త తనను అసహజ సెక్స్ కోసం హింసించాడంటూ గత ఏడాది పూనమ్ పాండే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో అరెస్టయిన సామ్ బోంబే బెయిల్‌పై విడుదలయ్యాడు. ఆ తరువాత పూనమ్‌తో రాజీ పడ్డాడు. ఇద్దరూ బాంద్రాలోని ఓ ఫ్లాట్‌లో నివసిస్తున్నారు. భర్తతో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయాయని, తామిద్దరం సంతోషంగా జీవిస్తున్నామంటూ ఇదిరకు పూనమ్ పాండే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

భర్తపై ఫిర్యాదు..
తాను భర్తను అమితంగా ప్రేమిస్తున్నానని, అతనితో అంత త్వరగా తాను వివాహ బంధాన్ని తెంచుకోలేనని ఇదివరకు పూనమ్ పాండే స్పష్టం చేశారు. అతనితో ఉన్న మనస్పర్థలు, భేదాభిప్రాయాలను తొలగిపోయాయని, సన్నిహితంగా మెలుగుతున్నానంటూ అన్నారు. ఇప్పుడు మళ్లీ తాజాగా పూనమ్ పాండే.. తన భర్తపై కేసు నమోదు చేశారు. శారీరకంగా హింసిస్తున్నాడంటూ బాంద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశాడని, తీవ్రంగా కొట్టాడని పేర్కొన్నారు.
Recommended Video

తీవ్రంగా కొట్టాడంటూ..
తన భర్త మళ్లీ పాత అవతారంలో కనిపిస్తున్నాడని, రాత్రి తనను తీవ్రంగా కొట్టాడని అన్నారు. ముఖానికి, చేతులకు గాయాలయ్యాయని అన్నారు. ఒకరకంగా తనపై సామ్ బోంబే హత్యాయత్నానికి పాల్పడ్డాడని చెప్పారు. ఈ మేరకు ఆమె బాంద్రా పోలీసులకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గృహహింస నిరోధక చట్టం కింద కేసు పెట్టారు. త్వరలోనే అతణ్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పారు.
-
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
60 ఏళ్ల క్రితమే రాసిపెట్టిన 'మరణ శాసనం'! ప్రపంచానికి ఆఖరి రోజు? -
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications