Hero: రేప్ చేసి చంపేస్తారంట, 24 గంటల్లో 500 వార్నింగ్ ఫోన్లు, బీజేపీ పనే, బాయ్స్ సిద్దార్థ్ ఫైర్ !
చెన్నై: తన ఫోన్ నెంబర్ లీక్ చేసి మా ఫ్యామిలీకి చిత్రహింసలు పెడుతున్నారని ప్రముఖ హీరో, బాయ్స్, నువ్వువస్తానంటే వద్దంటానా సినిమాల ఫేమ్ సిద్దార్థ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మమ్మల్ని చేస్తామని, మా కుటుంబ సభ్యులపై అత్యాచారం చేస్తామని కొందరు తమని బెదిరిస్తున్నారని, 24 గంటల్లో 500కు పైగా వార్నింగ్ ఫోన్స్ వచ్చాయని హీరో సిద్దార్థ్ ట్విట్ చేశారు. తమిళనాడు బీజేపీ శాఖ ఐటీ సెల్ విభాగం తన ఫోన్ నెంబర్ లీక్ చేసిందని హీరో సిద్దార్థ్ ఆరోపణలు చెయ్యడం రాజకీయంగా కుదిపేసింది.

24 గంటల్లో 500 వార్నింగ్ ఫోన్లు
హీరో సిద్దార్థ్ ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతాలో బీజేపీ నాయకుల మీద ఆరోపణలు చేస్తూ పోస్టులు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తన ఫోన్ నెంబర్ ను బీజేపీ తమిళనాడు శాఖ ఐటీ సెల్ విభాగం లీక్ చేసిందని హీరో సిద్దార్థ్ ఆరోపించారు. గత 24 గంటల్లో తనకు, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తూ 500కు పైగా ఫోన్లు వచ్చాయని హీరో సిద్దార్థ్ సంచలన ఆరోపణలు చేశారు.

అన్ని ఫోన్లు రికార్డు చేశాను
తనకు, తన కుటుంబ సభ్యులను చంపేస్తామని, మా ఇంట్లో ఆడాళ్లను రేప్ చేస్తామని అసభ్యంగా మాట్లాడుతూ వచ్చిన అన్ని ఫోన్లు మేము రికార్డు చేశామని, ఆ ఫోన్ నెంబర్ల వివరాలు మొత్తం తాను పోలీసులకు అప్పగించడానికి సిద్దం అవుతున్నానని, తాను చేతులు కట్టుకుని కుర్చోనని, ఎవ్వరినీ సామాన్యంగా వదిలిపెట్టనని హీరో సిద్దార్థ్ ఆయనకు బెదిరింపు ఫోన్లు చేసిన వారికి నేరుగా వార్నింగ్ ఇచ్చాడు.

నీఛంగా మాట్లాడారు.... స్క్రీన్ షాట్స్ షేర్
మా కుటుంబ సభ్యులు నీఛంగా మాట్లాడుతూ వార్నింగ్ ఇస్తూ మాకు ఫోన్లు చేశారని ఆరోపిస్తూ వాటి స్క్రీన్ షాట్ లతో సహ సోషల్ మీడియాలో పోస్టు చేసిన హీరో సిద్దార్థ్ తమిళనాడు బీజేపీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం తమిళనాడు బీజేపీ ఐటీ సెల్ విభాగం లీడర్స్ తన ఫోన్ నెంబర్ లీక్ చేశారని హీరో సిద్దార్థ్ సంచలన ఆరోపణలు చేశారు.

హీరోకు నటి శ్రీయ సపోర్ట్
హీరో సిద్దార్థ్ కు మద్దతుగా నటి శ్రీయా ధన్వంథరి పూర్తి మద్దతు ఇచ్చారు. స్కామ్ 1992 వెబ్ సిరీస్ లో జర్నలిస్ట్ సుచేతా దలాల్ పాత్రలో శ్రీయ ధన్వంథరి నటించిన విషయం తెలిసిందే. ప్రముఖ నటుడు సిద్దార్థ్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఇంత నీఛంగా వేధించిన వారిని ఎవ్వరనీ వదిలిపెట్టకూడదని నటి శ్రీయ డిమాండ్ చేశారు.
Recommended Video

హీరోకు కోవిడ్ విమర్శల ఎఫెక్ట్ ?
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (NDA) కరోనా వైరస్ ను అరికట్టడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపిస్తూ ఇటీవల కాలంలో హీరో సిద్దార్థ్ అనేక విమర్శలు చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తదితరునుల పరోక్షంగా విమర్శిస్తూ వారితో పాటు తమిళనాడు బీజేపీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు తన ఫోన్ నెంబర్ లీక్ చేసి మమ్మల్ని చంపేస్తామని వార్నింగ్ ఇస్తున్నారని హీరో సిద్దార్థ్ ఆరోపణలు చెయ్యడం కలకలం రేపింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications