షాక్ లోనే ఉన్నా, ఇంత అన్యాయమా?: ప్రధాని మోడీకి లేఖ, వదలను: హీరో విశాల్

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రముఖ నటుడు, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర సంఘం ప్రధాన కార్యదర్శి విశాల్ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు తిరస్కరించడంతో ఆయన అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బ !

ప్రజాస్వామ్యానికి ఎదురుదెబ్బ !

బుధవారం చెన్నైలో మీడియాతో మాట్లాడిన హీరో విశాల్ తన నామినేషన్ పత్రాలు తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆరోపించారు. మంగళవారం తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడంతో ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని విశాల్ ఆరోపించారు.

  RK Nagar by-Polls : Vishal's Nomination Rejected, Accepted And Rejected Again
   ప్రత్యేకంగా పరిశీలించారు !

  ప్రత్యేకంగా పరిశీలించారు !

  తన నామినేషన్‌ను పత్రాలు మాత్రమే ఎందుకు ప్రత్యేకంగా పరిశీలించి తిరస్కరించారని విశాల్ ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. తన పట్ల ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరును చూసి షాక్‌ తిన్నాని, ఇప్పటికీ ఆ షాక్ నుంచి బయటకు రాలేకపోతున్నాని విశాల్ అన్నారు.

   అధికారం ఉందని దౌర్జన్యం ?

  అధికారం ఉందని దౌర్జన్యం ?

  తన నామినేషన్‌ పత్రాలు బలపరుస్తూ సంతకాలు చేసిన స్థానికులను తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రభుత్వం బెదిరించిందని హీరో విశాల్‌ ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు తిరస్కరించారని హీరో విశాల్ ఆరోపించారు.

   ప్రధాని మోడీకి లేఖ రాశాను !

  ప్రధాని మోడీకి లేఖ రాశాను !

  ఆర్ కే నగర్ ఉప ఎన్నికలకు సంబంధించి తనకు అన్యాయం జరిగిందని, తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్ తిరస్కరించిందని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశానని హీరో విశాల్ చెప్పారు. తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల కమిషన్ తిరస్కరించడం సరికాదని ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో వివరించానని హీరో విశాల్ మీడియాకు చెప్పారు.

   కోర్టును ఆశ్రయిస్తా !

  కోర్టును ఆశ్రయిస్తా !

  ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాను పోటీ చెయ్యడానికి సమర్పించిన నామినేషన్ పత్రాలను ఎన్నికల కమిషన్ అధికారులు తిరస్కరించడంతో తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తానని, ఎవ్వరినీ వదిలిపెట్టనని విశాల్ స్పష్టం చేశారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Actor Vishal has said that still he has not come out of the shock from the dismissal of his candidature in the RK Nagar.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి