10 మంది కూతుళ్ల తర్వాత మగబిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ఎక్కడంటే..?

ఆ దంపతులు కొడుకు పుట్టాలని కలలు కన్నారు. కుమారుడి కోసం ఏళ్లపాటు నిరీక్షించారు. కానీ ఆ మహిళ ప్రసవించిన ప్రతి సారీ ఆడ పిల్ల పుట్టింది. అలా ఏకంగా 10 మంది కూతుళ్లకు జన్మనిచ్చింది. అయినా కూడా కొడుకు కావాలన్న ఆమె కోరిక అలాగే ఉంది. చివరగా 11 వ కాన్పులో కుమారుడికి జన్మనిచ్చింది. దీంతో ఆ కుటుంబం సంబరాలు చేసుకుంది. ఇన్నేళ్లకు దేవుడు తమను కరుణించాడని సంబర పడుతున్నారు. అయితే ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ ఘటన వింటే కుమారుడు కావాలని ఆ దంపతులు ఎంతగా నిరీక్షించారో అర్థం అవుతుంది. హరియాణాలోని జింద్ జిల్లా ఉచానా ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ ఘటన దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చకు తెరతీసింది. ఆ దంపతులకు ఇప్పటికే 10 మంది కూతుళ్లు ఉన్నారు. ఓ పక్క సంతానం కోసం చాలా మంది దంపతులు నిరీక్షిస్తుంటే వారికి ఏకంగా 10 మంది సంతానం. కానీ వారికి కొడుకు కావాలని కోరిక ఉంది. అందుకోసం ఇలా ఏళ్లకు ఏళ్లు నిరీక్షించసాగారు. చివరికి 11 వ కాన్పులో ఆ మహిళ కుమారుడికి జన్మనిచ్చింది.


అయితే వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆ మహిళకు గర్భధారణతో పాటు ప్రసవం కూడా అత్యంత ప్రమాదకర స్థితిలో జరిగింది. మహిళకు తీవ్ర రక్తహీనత ఉంది. దాంతో పాటుగా శిశువు పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది అని వైద్యులు వివరించారు. అయితే ప్రసవం అనంతరం ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు 11 వ సంతానంగా కొడుకు పుట్టడంతో ఆ కుటుంబం పండగ చేసుకుంటుంది.

After 10 Daughters Haryana Woman Welcomes Baby Boy 11th Child Brings Joy in Jind

అయితే ఇదే ఘటనపై తండ్రిని సంప్రదించగా.. తన పెద్ద కుమార్తె ఇంటర్ చదువుతోందని సమాధానం ఇచ్చాడు. అలాగే రెండో అమ్మాయి టెన్త్ అని తెలిపాడు. ఈ క్రమంలో కూతుళ్ల పేర్లను కూడా ఆ తండ్రి మర్చిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అయితే మరోవైపు ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మగబిడ్డ కోసం భార్యను ఇలా హింసించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+