శిథిలాల కింద 72 గంటలు: స్లిప్పర్స్ ఏవని అడిగాడు

చెన్నై‌: ఓ వ్యక్తి 76 గంటల పాటు కూలిన చెన్నై భవనం శిథిలాల కింద ప్రాణాలతో ఉండిపోయాడు. బయటకు వచ్చిన తర్వాత తన స్లిప్పర్ల గురించి వాకబు చేశాడు. సోమావరం ఉదయం 9 గంటల ప్రాంతంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ శునకం రుస్తుం ఓ చిన్నపాటి రంధ్రం వద్ద నించుని మొరగడం ప్రారంభించింది. అప్పటికి భవనం కూలి 64 గంటలు అవుతోంది.

లైఫ్ డిటెక్టర్లు, కట్టర్స్, కెమెరాలు వాడి అతన్ని రక్షించడానికి మరో 8 గంటలు పట్టింది. పసుపుపచ్చ రంగు టీ షర్ట్ ధరించిన వ్యక్తి బయటకు వచ్చాడు. తన స్లిప్పర్లు ఏవంటూ అడిగాడు. కొత్త చెప్పులు తెప్పిస్తామని ఎన్‌డిఆర్ఎఫ్ కమాండెంట్ ఎంకె వర్మ మర్యాదగా చెప్పాడు.

 After 72 hours under rubble, man emerges asking for his slippers

అతను ఒరిస్సాకు చెందిన 29 ఏళ్ల వికాస్ కుమార్. ఆ తర్వాత అతను ఏమీ జరగనట్లుగా నడిచిపోయాడు. దాంతో సహాయక బృందాలకు నైతిక విజయం సాధించినట్లనిపించింది. అతన్ని బయటకు తీయడానికి సహాయక బృందాలు పడిన శ్రమ ఇంతా అంతా కాదు.

ఉదయం పదకొండున్నర గంటలకు ఓ వ్యక్తి అరుపులు వినిపించాయి. అతన్ని స్పృహలో ఉంచడానికి మాట్లాడుతూ వెళ్లారు. భవనం కూలినప్పుడు తాను రెండో అంతస్థులో ఉన్నానని చెబుతూ తన మిత్రులు ఎలా ఉన్నారని అతను అడిగాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+