Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

లోక్ సభ ఎన్నికల్లో ఖార్గే ఎక్కడి నుంచి పోటీ అంటే, ఏకంగా యోగి టార్టెట్, మోదీ, ప్రియాంక !

బెంగళూరు/లక్నో: 2024లో జరిగేనున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి పలు రాజకీయ పార్టీలు ఇప్పటికే సన్నాహాలు పూర్తి చేశాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌పై జాతీయ పార్టీల చూపు పడింది. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నుంచి మళ్లీ పోటీ చేయాలని భావిస్తున్నారని తెలిసింది. తమ ప్రాభవాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లో దళితుల ఓట్లపై కన్నేసిన కాంగ్రెస్ యూపీ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జన్ ఖార్గేను బరిలోకి దింపాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఉత్తరప్రదేశ్‌లోని దళితుల ఓటుబ్యాంకుపై బీఎస్పీ ప్రభావం ఉంది. దీంతో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తగులుతుందని ఆపార్టీకి చెందిన కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు.

AICC president Mallikarjun Kharge contesting from Uttar Pradesh in 2024 Lok Sabha elections?

ఈ నేపథ్యంలో దళిత వర్గానికి చెందిన మల్లికార్జున ఖార్గే ఉత్తరప్రదేశ్‌లోని రిజర్వ్‌డ్ స్థానం నుంచి పోటీ చేయాలని యూపీ కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పూర్తిగా పట్టు కోల్పోయింది. పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవాలన్నది నేతల పట్టుదల. దళితులు, ముస్లింల ఓట్లను ఆకర్షించి పార్టీని బలోపేతం చేయాలని కాంగ్రెస్ నేతలు భావించినట్లు తెలిసింది.

2024 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) మద్దతుతో ఇటావా లేదా బరాబంకి రిజర్వ్‌డ్ నియోజకవర్గాల నుంచి మల్లికార్జున్ ఖార్గేను పోటీకి దింపాలని పార్టీ భావిస్తున్నట్లు యుపీ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్, ఎస్పీ రెండూ ఇండియా కూటమిలో భాగమే. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్యే టిక్కెట్ల పంపిణీ జరగనుంది.

ఉత్తరప్రదేశ్‌లోని దళిత ఓటర్లను ఆకర్షించేందుకు ఖార్గే అభ్యర్థిత్వంపై చర్చలు కాంగ్రెస్‌లో తెరపైకి వచ్చాయి. ఇది రాష్ట్రంలోని ఎస్పీతో పాటు ఇతర మిత్రపక్షాలకు ఉపయోగపడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ అంశంపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ మాట్లాడుతూ దళితులపై మాయావతి ప్రభావం తగ్గుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో దళితులకు కాంగ్రెస్ పార్టీ బెస్ట్ ఛాయిస్ అని అన్నారు.

AICC president Mallikarjun Kharge contesting from Uttar Pradesh in 2024 Lok Sabha elections?

ఇటీవల జరిగిన ఘోసి అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో ఎస్పీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఫలితం గురించి అజయ్ రాయ్ మాట్లాడుతూ ఘోసి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి 42 వేలకు పైగా ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థిని ఓడించారు. దళితులు నోటా బటన్‌ను నొక్కాలని మాయావతి పిలుపునిచ్చారు. నోటాకు అనుకూలంగా కేవలం 1,700 ఓట్లు మాత్రమే వచ్చాయని తెలిపారు. ఘోసీ పోలింగ్ బూత్‌లలో దళితులు ఓటు వేశారు.

ఇండియా కూటమికి దళితుల ఓట్లు భారీగా వచ్చాయన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని రాయ్ చెప్పారు. 2009, 2014లో అమేథీ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.

AICC president Mallikarjun Kharge contesting from Uttar Pradesh in 2024 Lok Sabha elections?

2014ప్రియాంక గాంధీ వారణాసి నుంచి పోటీ చేస్తే ఆమె గెలుపు కోసం కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేస్తారని రాయ్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసేందుకు సోనియా గాంధీ నిరాకరిస్తే ఆ స్థానంలో ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+