Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అల్లుడి కోసం త్యాగం చేసిన ఏఐసీసీ చీఫ్, ఐదు మంది మంత్రులకు బంపర్ ఆఫర్, హైకమాండ్ లెక్క !

కర్ణాటక లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 21 నియోజకవర్గాల్లో 17 స్థానాలకు గురువారం కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్లు ఖరారు చేసింది. ఈ జాబితాలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే పేరు లేకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. దశాబ్దన్నర కాలంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మల్లికార్జున్ ఖార్గే లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగకపోవడం ఇదే తొలిసారి.

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయనకు అత్యంత సన్నిహితులు చెబుతున్నారు. మల్లికార్జున్ ఖార్గే సొంత నియోజకవర్గం కలబురగి నుంచి ఆయన అల్లుడు రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని కాంగ్రెస్ పార్టీ గురువారం అధికారికంగా ప్రకటించింది. దీంతో మల్లికార్జున్ ఖార్గే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని తేలిపోయిందని ఆయనకు అత్యంత సన్నిహితులు అంటున్నారు.

AICC president Mallikarjun Kharge dropped out of the Lok Sabha elections for his son-in-law

గత 15 ఏళ్లలో మల్లికార్జున్ ఖార్గే లోక్‌సభ ఎన్నికల బరిలో లేకుండా కలబురిగిలో ఎన్నికలు జరుగుతున్నాయని కలబురగి కార్యకర్తలు, వారి మద్దతుదారులు తెలిపారు. మల్లికార్జున్ ఖార్గే 2009లో, 2014లో కలబురగి నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మాల్లికార్జున్ ఖార్గేకి స్థానిక ఓటర్లు ఓటమి రుచి చూపించారు. మొదటిసారి కలబురిలో మల్లికార్జున్ ఖార్గే ఎంపీగా ఓడిపోయి ఆ సీటు కోల్పోయారు.

సొంత నియోజక వర్గంలో మల్లికార్జున్ ఖార్గే ఓడిపోవడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం రాజ్యసభలో మల్లికార్జున ఖార్గే ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నారు. కలబురగి జిల్లాలో జన్మించిన మల్లికార్జున్ ఖార్గే అల్లుడు రాధాకృష్ణ ప్రముఖ వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాల్లో ఎక్కడా కనిపించని ఆయన తెర వెనుక పనిచేస్తూనే రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మల్లికార్జున్ ఖార్గే తన ప్రచార కార్యక్రమాలను ఆయన అల్లుడు రాధాకృష్ణ నిర్వహించారు.

రాజకీయ వ్యూహాన్ని ఇంతకాలం రచిస్తున్న రాధాకృష్ణ ఒక్కసారిగా లోక్ సభ ఎన్నికల సమయంలో అందరి ముందు ప్రత్యక్షం అయ్యారు. కర్ణాటకలోని కోలార్, చిక్కబళ్లాపురం, చామరాజనగర్, బళ్లారి లోక్ సభ నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నాలుగు నియోజకవర్గాలు మినహా కర్ణాటకలోని అన్ని నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్లు ప్రకటించింది. మల్లికార్జున్ ఖార్గే లాగే మరికొందరు కర్ణాటకలోని కాంగ్రెస్ మంత్రులు తమ పిల్లలను రంగంలోకి దింపి ఎంపీ టిక్కెట్లు సంపాధించుకోవడంలో సఫలం అయ్యారు.

AICC president Mallikarjun Kharge dropped out of the Lok Sabha elections for his son-in-law
కర్ణాటక మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ కుమారుడు మృణాల్‌ హెబ్బాళ్కర్‌ (బెళగావి), కర్ణాటక రవాణా శాఖా మంత్రి రామలింగా రెడ్డి కుమార్తె, మాజీ ఎమ్మెల్యే సౌమ్యారెడ్డి (బెంగళూరు సౌత్‌), ప్రజాపనుల శాఖా మంత్రి సతీష్‌ జారకిహోళి కుమార్తె ప్రియాంక జారకిహోళి (చిక్కోడి), వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల మంత్రి శివానంద పాటిల్ కుమార్తె సంయుక్త పాటిల్ (బాగలకోటే), అటవీ శాఖా మంత్రి ఈశ్వర్ ఖండ్రే కుమారుడు సాగర్ ఖండ్రే (బీదర్) లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపడంలో సఫలమయ్యారు.

కాంగ్రెస్‌లోని కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ కుటుంబాలకు టికెట్లు కేటాయించనున్న మాట వాస్తవమే అని ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అంటున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. మొత్తం 28 నియోజకవర్గాల్లో సిట్టింగ్ మంత్రుల పిల్లలు, కుటుంబ సభ్యులకే టిక్కెట్లు ఇచ్చి ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలనే కాంగ్రెస్ వ్యూహం పన్నిందని తెలిసింది మొత్తం మీద కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న హవా ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో కూడా ఉంటుందా ? అని కొద్ది రోజుల్లో తేలిపోతుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+