Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రధాని మోదీ రూటు మాకు నచ్చదు, మాల్దీవుల విషయంలో కూడా అంతే, ఆ పదవులు లేవు, ఖార్గే !

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలోనూ కర్ణాటక రాష్ట్రంలో ముగ్గురు డీసీఎంల ఎంపికపై కాంగ్రెస్‌లో జోరుగా చర్చ సాగుతోంది. అడిషనల్ డీసీఎంల విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నేతల స్థాయిలో ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే వివరణ ఇచ్చారు. కర్ణాటకలో ముగ్గురు ఉపముఖ్యమంత్రి పదవులు వస్తాయన్న విషయంలో ఖార్గే క్లారిటీ ఇచ్చారు.

ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమిస్తారని వస్తున్న పుకార్లు కేవలం ఊహాగానాలేనని కర్ణాటకలోని కలబురగిలో మీడియాతో మాట్లాడిన మల్లికార్జున్ ఖార్గే స్పష్టం చేశారు. కర్ణాటకలో ముగ్గురు ఉప ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముందు అలాంటి ప్రతిపాదన లేదని, మీకు మరింత స్పష్టత కావాలంటే మీరు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ లను స్వయంగా అడగాలని మల్లికార్జున్ ఖార్గే మీడియాకు చెప్పారు.

AICC President Mallikarjun Kharge said that we do not like the behavior of Prime Minister Narendra Modi

లోక్ సభ ఎన్నికల సమయంలో ముగ్గురు డీసీఎంల అంశం తెరపైకి రాకూడదని, ఇది కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెలుతాయని, ఇప్పటికైనా ప్రభుత్వాన్ని నడిపే విషయాలపై అందరూ దృష్టి సారించాలని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఐదు ఉచిత హామీల అమలుపై మంత్రులు దృష్టి సారించాలని, సిద్ధరామయ్య, డీకే శివకుమార్, హోమ్ మంత్రి పరమేశ్వర్ అందరూ కలిసి ఆ పని చేస్తున్నారని మల్లికార్జున్ ఖార్గే అన్నారు.

కొన్ని నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఇదే రోజు బుధవారం సమావేశం ఏర్పాటు చేశామని, కర్ణాటక నుంచి ఎంపీ అభ్యర్థుల ఎంపికపై ఇదే సమావేశంలో చర్చించనున్నట్లు ఏఐసీసీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖార్గే తెలిపారు. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని లోక్ సభ నియోజక వర్గాల పోలింగ్‌ కేంద్రాల పరిశీలకులను నియమించినట్లు మల్లికార్జున్ ఖార్గే తెలిపారు.

AICC President Mallikarjun Kharge said that we do not like the behavior of Prime Minister Narendra Modi

ఇదే సమావేశంలో ఏ అభ్యర్థిని ఏ లోక్ సభ నియోజక వర్గం నుంచి రంగంలోకి దించాలనే దానిపై కూడా చర్చించనున్నారు. దేశంలో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రతిపక్షాలు ఐక్యంగా వెళ్లాలని ఇండియా కూటమి నిర్ణయించింది. అందరం కలిసికట్టుగా పని చేస్తామని ఇప్పటికే ఇండియా అఖిలపక్షంలోని ముఖ్యనేతలు చాలా మంది చెప్పారు.

మాల్దీవుల శత్రుత్వంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖార్గే వ్యాఖ్యానిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగ విధానం సరికాదన్నాని అన్నారు. నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయిన తరువాత అన్నీ వ్యక్తిగతంగా తీసుకుంటున్నారని మల్లిఖార్జున్ ఖార్గే అసహనం వ్యక్తం చేశారు. అన్నింటిలో ముఖ్యమైనది మన పొరుగువారిని అంతర్జాతీయ స్థాయిలో బాగా చూసుకోవాలని, వాళ్లతో గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు పోరాటానికి సిద్ధం కావాలని మల్లికార్జున్ ఖార్గే అన్నారు.

ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను విడదీసి బంగ్లాదేశ్‌ను ఏర్పాటు చేసిన తీరు, అటువంటి పోరాటానికి మనం వెనుదిరిగి చూడకూడదని, అంతర్జాతీయ పాలసీ విషయంలో నరేంద్ర మోదీ తన మనసుకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారు. మోదీ కోరుకున్న వారిని కౌగిలించుకుంటారని, ఆయన వద్దు అనుకున్న వారిని ఆటపట్టిస్తారని, మన పొరుగువారితో స్నేహపూర్వక సంబంధాన్ని కొనసాగించాలని, వారితో కలిసి వెళ్లాలని, వాళ్లు మనపైకి వస్తే వాళ్ల భరతం పట్టడానికి మనం దేశం కోసం పోరాటం చెయ్యడానికి సిద్ధంగా ఉండాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+